Thursday, January 7, 2016

అమెరికా చదువులు

         అమెరికా చదువులు
గత కొద్ది కాలముగా, తెలుగు విద్యార్డులెందరో  అమెరికాకు ఉన్నత చదువుల నిమిత్తము వెళ్ళటం ,అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులతో ముఖాముఖి తలపడ లేక ,తిరిగి ఇండియా కు రావటం పరిపాటి గా మారింది .
అమెరికా లోని రెండు ప్రముఖ యూనివర్సిటీ ల పేర్లు చెబుతూ , అవి బ్లాక్ లిస్టు లో ఉన్నవని పుకార్లు పుట్టించటం , అమెరికాకు ఎందునిమిత్తం వచ్చారన్న ప్రశ్నకు బాంబులేయటానికి వస్తామా అని, మనవిద్యార్డులు,  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో వేళాకోళం గా మాట్లాడడటం, అసలు అమెరికా ప్రభుత్వ మే ఇలా రెచ్చ గొట్టటం చేస్తున్నదా ? ఇవ్వన్ని గమనిస్తూ భారత ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరించటం చూస్తుంటే - సామాన్యుడుకి ఇది  ఒక అర్థం గాని  విషయం గా  మారింది !
సాధారణముగా ,అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టు లో వున్న విశ్వవిద్యాలయముల జాబితా ని ఆయా దేశాలలోని తమ రాయబార కార్యాలయములకు పంపుతుంది. లేదా సంబందిత వెబ్ సైట్లను గమనించినా విషయం తెలుస్తుంది . అక్కడి విశ్వవిద్యాలయములలో చదవాలుకొనే విద్యార్థులు అక్కడి పరిస్తితులు గురించి , వారితో వ్యవహరించవలసిన విధానాల ఫై సరయిన విధానము తెల్సుకోకపోవటం ప్రధాన లోపముగా కనిపిస్తోంది. ముఖ్యముగా, అమెరికన్ లు మాట్లాడే ఇంగ్లిష్ ఏస ను అర్థం చేసుకోలేక పోవటం, ఈ విషయం లో తగు సాధన చేయక పోవటం , ఎడ్యుకేషన్ కన్సులంట్ల  మీద పూర్తి భారం వేసి కూర్చోవటం, కూడా ఒక లోపం గ వున్నది.
        అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ,మీరు ఇక్కడ విద్యాభ్యాసమునకు , ఆర్ధిక వనరులు గురించి అడిగినప్పుడు, పార్ట్ టైం జాబు చేసి సంపాదిస్తూ చదువుకుంటామని, నిషేధిత సమాధానములు చెప్పడటం చూస్తుంటే సరియిన అవగాహన లేకుండగానే,అమెరికాకు పయనమయ్యారని తెలుస్తోంది .
మొదట వెళ్ళిన వారు ఫై విధముగా సమాధానాలు చెప్పటం తో, అప్రమత్తమయ్యిన  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తరువాత వచ్చే వారి విషయములో ఖటినముగా వ్యవహరించి, వారు ఏమి చెబుతున్నారో వినే ఓపిక కూడా లేకుండా విపరీత అసహనముతో మన వారిని 12 నుండి 24 గంటల పాటు నిర్బంధించి (ఏదో ఖైదులులాగ ),చిత్రహింసలకు గురి చేసి ,మానసిక క్షోభ కు గురిచేశారు.
 ఈ సందర్భముగా ,మన విద్యార్థులు తెలుస్కోవాల్సిన విషయం ఒకటున్నది, అది ఏమంటే , మీ ఫేస్బుక్ ఎకౌంటు లో మీరు పోస్ట్ లేదా చాంటింగ్ చేస్తున్న, మరియు షేర్ చేస్తున్న విషయాలను బట్టి మిమ్ములను అంచనా  వేయటం జరుగుతోంది. ఇది మీ భవిష్యత్తు ఫై ప్రభావం చూపే పరిస్తితి నేడు ఉన్నది.
ఇదిలా ఉంటే, అమెరికా లోని మన తెలుగు సంఘాలు మీకు ఏ కష్టమొచ్చినా చెప్పండి , మేమున్నాం అంటూ నెమ్మదిగ స్పందించాయి. అయినా, మీరు సరియిన అవగాహన లేకుండా అమెరికా లో చదువులకు రావటం ఏమిటి అన్నట్లు ఉన్నాయి వీరి మాటలు. ఇన్ని కబుర్లు చెప్పే వీరు- ఇక్కడి విద్యార్థులకు  ఈ విషయాల ఫై అవగాహన శిబిరాలను నిర్వహించవచ్చు కదా !
        ఇప్పడు భారత ప్రభుత్వ వైఖరి చూద్దాము – తెలుగు వాడు అనే టప్పటికి కేంద్రముకు కూడా లోకువ లా ఉంది. ఈ పరిస్తితుల ఫై అమెరికా ప్రభుత్వం తో మాట్లాడి , ఈ సమస్యకు చక్కని  దారి చూపి విద్యార్థుల భవిష్యత్తు కు మంచి బాట చూపవల్సినది   పోయి, నిమ్మకు నీరెత్తినట్లు   కూర్చుది.
వీటన్నిటికి కారణం, బట్టి చదువులు, గుమాస్తాలను తయారు చేసే మన విద్యా వ్యవస్థ , ఈ  వ్యవస్థ ను   బాగుచేసే పనికి నడుం కట్టకుండా అలసత్వం ప్రదర్శించే  మనము -  కాదంటారా !


 






No comments:

Post a Comment