చిన్నారి మేధావి –సాయి సుజన్
కొండపల్లి కి చెందిన సాయి సుజన్ కిలిమి- 9 సంవ్సత్వరాల వయస్సులో ఈ విద్యార్ధి చూపుతున్న అసమాన జ్ఞాపక శక్తి- అందరిని అబ్బుర పరుస్తోంది.
ఆదర్శ
విద్యానికేతన్ – కొండపల్లి (కృష్ణా జిల్లా) లో L.K.G చదువుతున్నప్పుడు, తల్లి ఇంటి దగ్గర నేర్పించిన రాష్ట్రాలు- వాటి రాజధానులు,రాజకీయనాయకులు, దేశభక్తి గేయాలు
, వాటి రచయితలు,--- ఇలా జనరల్ నాలెడ్జి కి సంబంధించినవి , నేర్పుతున్నప్పడు, వెంటనే వాటిని గుర్తుంచి,చెప్పటం-ఆ తల్లిని ఆశ్చర్యపరిచింది. తన బిడ్డ లోని
అబ్బుర పరచే జ్ఞాపక శక్తి ని పదిమంది కి తెలపాలన్న ఉద్దేశంతో ,ఆ స్కూల్ correspondent అయిన హబిబుల్లా గారిని కోరినప్పుడు,వారు సంశయిస్తూనే , స్కూల్ వార్షికోత్సవము లో మొదటసారిగా అవకాశం ఇచ్చారు. అప్పుడు ,ఈ
కుర్రాడు చూపించిన ప్రతిభకు అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.
అది మొదలు ,సాయి సుజన్ ప్రస్థానం మొదలయ్యంది.
తరువాత, ఇతని తల్లి దుర్గా రాణి – సాక్ఖి ఛానల్ లో వస్తున్నా
SPELL-BEE, కార్యాక్రము (అంటే ఇంగ్లీష్ పదాలకు కొద్ది సెకన్లో ఆ
పదానికి చెందిన స్పెల్లింగ్ చెప్పగలగటం) లో ఒక చిన్నారిని శాలువతో,సత్కరించటం చూసి
,తన బిడ్డను కూడా, ఆ ప్రోగ్రాంలో పాల్గొనేలాచేయాలనుకుంది . కానీ ఎలా? ఎవరిని
అడగాలో తెలయదు? చివరకు, సాక్ఖి దిన పత్రిక
విలేఖరి ఆదిశేషు గార్ని కలిసి వివరాలు తెలుసుకొని, విజయవాడ, ఆటో నగర్ లో ఉన్న ఆ
పత్రిక కార్యాలయమునకు వెళ్లి , తన బిడ్డ ఆ కార్యక్రముములో పాల్గొనెలా చేసింది. విజయవాడ లో జరిగిన మూడు స్థాయిలలో గెలిచి , హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఫైనల్ రౌండ్ పోటీలో, 4వ స్థానం
సంపాదించాడు . తరువాత, ఇదే ఛానల్ వారు
నిర్వహిస్తున్న MATHS-BEE కార్యక్రమము లో పాల్గొన బోతున్నాడు.
ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించిన, ఆశయస్పూర్తి ఫౌండేషన్‌వారు , మార్చి2014లో ఇతని గురించి విచారించి, మరింత ప్రోత్పాహించాన్న ఉద్దేశ్యముతో, ఇతనికి ఆసక్తి కలిగిన గేమ్ అయిన చదరంగం లో తగు కోచింగ్ ను ఇప్పించి(అందుకు అయ్యే ఖర్చును భరించి),టోర్నమెంటు స్తాయికి తీసుకెళ్ళారు. అంతే కాదు, ఇతని కుటుంబ ఆర్ధిక స్థితిని గమనించి, ప్రతినెల రూ॥ 500/ ను, కేంద్ర ప్రభుత్వ పథకములో జమ చేస్తున్నారు.
చదువుతున్నారు, మరియు వారి ఆసక్తి ని గమనించి ప్రోత్పాహించాలి.
ఈ మేధస్సు కు కారణం బహుశ సాయిసుజన్ మేనమామ నుంచి వచ్చిఉండొచ్చని అతని తల్లి అభిప్రాయపడ్డారు.
ఈ చిన్నారిని Vijayawada children's schools and tutorials Association వారు 2012 మరియు 2015 నిర్వహించిన states and capitals and spelling test లోను, sakshi SPELL BEE ,కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహించిన జ్ఞాపకశక్తి, మరియు క్విజ్ పోటీలో, NEHRU YUVA KENDRA, VIJAYAWADA వారి G.K పోటీలో - పాల్గొని అన్నిటిలోనూ ప్రధమ బహుమతి పొందాడు.
అంతే కాదు , ఈ విద్యార్థికి పౌరాణిక పాత్ర వేషధారణలో కూడ ప్రవేశం ఉన్నది.
ఈ చిన్నారి గురించి చినుకు మాస పత్రిక కూడా తన ఫిబ్రవరి 2014 సంచిక లో U.K.G లో G.K బుడుగు పేరున ఒక వ్యాసం వ్రాయటం జరిగింది.
అయితే , కేవలం తల్లి మాత్రమే ఇతని బాగోగులు చూడటం వల్ల, ముందు ముందు, ఈ చిన్నారి ఎదుగుదలకు ,ఆర్ధిక ఇబ్బందులు ఎదురవచ్చు. కాబట్టి దాతల ముందుకొచ్చి సాయం అందిస్తే , ఇతను మరింత రాణిస్తాడు అనటంలో సందేహమే లేదు .
No comments:
Post a Comment