ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థ లో దినసరి వేతన కార్మికుల పరిస్టితి
ఇలా చేస్తే బాగుండవచ్చు
1. కనీసం 10 సంవత్సరాల పాటు ఒకే కేటగిరిలో పనిచేసినవారిని, తక్ష ణమే తరువాత పై కేటగిరీకి మార్చాలి.
2. అలా మార్చిన తర్వాత, వారిని పనితీరును మార్కుల రూపంలో కొలిచి, తగువిధంగా నెలవారీగా నగదు
బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇస్తూ, సంవత్సారాంతమున, వారి 12 నెలల మార్కులను సరాసరి లెక్కగట్టి, ఉ త్తమ ప్రతిభ లేదా మార్కు లు వచ్చిన వారికి వారి పై క్యాటగిరికి మార్చి, తదనుగుణంగా వేతనం చెల్లించాలి.
3. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలో వీరికీ ఓటుహక్కు తప్పక కల్గించాలి.
4. ఒక పరిశ్రమలో ఒకే యూనియన్ సూత్రము ను యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి.
5. సుదీర్ఘ కాలంపాటుపనిచేసి, ప్రమాదవశాత్తు చని పోయిన లేదా దీర్ఘకాలిక రోగాల తో ఉద్యోగం కోల్పోయిన
కార్మికు కుటుంబాలలో ఒకరికి దినసరి వేతనం పై ఉద్యోగం ఇవ్వాలి.
6. 20 సంవత్సరా పాటు పనిచేసిన కార్మికులను బేషరుతుగా శాశ్వత కార్మికులుగా తీసుకోవాలి.
ఇలా పై విధంగా చేసినపుడు ` కార్మికులు ఎంతో ఉత్సాహముగా పనిచేస్తారు, ఇటు ప్రభుత్వము నకు ఉన్న మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవటమే కాక ,ఆర్ధికంగా కూడా ఎంతో మేలు చేకూరుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలలో కొన్ని వేల మంది కార్మికులు దినసరివేతనం పై పనిచేస్తున్నారు. వీరిలో, ఏమీ చదువుకోని వారినుంచి, పి.జి, ఇంజనీరింగ్ లో డిప్లమా మరియు డిగ్రీ చదవినవారు వరకు పనిచేస్తున్నారు. అయితే, వీరిలో వారు చదివిన చదువకు, చేస్తున్న విధులకు ఏ కొద్ది మందికో తప్ప ,సంబంధం ఉండదు.
ఈ విద్యుత్ సంస్థ లో దినసరివేతనం పై పనిచేసే వారిని అన్`స్కిల్డ్, సెమి` స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా విభజించారు. వీరు చేసే పనిని బట్టి, వారు తెచ్చిన సిఫార్సును బట్టి,అర్హత ను బట్టి వారిని ఆయా కేటగిరిలో నియమిస్తారు. వీరికి ఎటువంటి నియామక ఉతర్వులు ఉండవు. ఇక నియామకపు తేదీ మొదలు, కొన్ని దశా బ్డము ల పాటు అదే కేటగిరిలో మ్రగ్గవలసినదే ! దీనిలో హైలీ ` స్కిల్డ్ ను ఎవరూ అనుభవిస్తున్నట్లుగా తెలియరాలేదు.
వీరు ఇంత సుదీర్గ కాలంపాటు పనిచేయటానికి కారణం` ఏ నాటికైనా బేషరుతుగా శాశ్వత కార్మికులుగా గుర్తి స్తారన్నఆశ !. దీనికి తోడు పని తక్కువ,జీతం ఎక్కువ అనేది కూడా ఒక కారణంగా ఉంది.
అయితే, ఈ సంస్థలో పని చేసే వారికి ఇస్తున్నగుర్తింపు గుర్రము, గాడిద కు ఒక రకంగానే ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా, వేతనంలో పెరుగుదల గానీ, లేదా కేటగిరిలో మార్పు గాని ఉండవు. దాంతో, ఇక్కడి కార్మికులలో నిరాశ, అలసత్వం కనిపిస్తాయి. సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన కార్మికుల ప్రమాదవశాత్తు గాని, అనారోగ్యం తో గాని మరణిస్తే, వారికుటుంబసభ్యులలో ఎవరికైనా దినసరివేతనం పై ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా అపురూపమైన విషయంగా ఉంది.
ఇక వేతన విషయానికి వస్తే మూలవేతనం పై కరువుభత్యం గత కొద్దికాలంగా ఇస్తూఉండటంతో, కొంత వెసులబాటుగా ఉన్నా, పెరుగుతున్న ధరలను చూస్తే నిరాశగా మారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా చేసే సి.పి.ఐ పాయిట్స్ కూడా నిరాశ పరిచేదిగానే ఉంది. గతంలో మూలవేతనం పై పెంపుదల ప్రతి రెండు సంవత్సరము లకు ఒకసారిగా ఉండేది.ఇప్పుడది , లేబర్ కమీనషనర్ గారు ఎప్పుడు పెంచుతారో తెలియనిపరిస్థితి !
ఈ కార్మికుల అవసరం ప్రభుత్వము నకు ఎంతో ఉంది, దశాబ్ధాములుగా చేస్తున్న వీరిని శాశ్వత కార్మికులుగా గుర్తించరు. ఎందుకంటే, శాశ్వత కార్మికులుగా గుర్తిస్తే, ప్రభుత్వము ఎంతో భారం పడుతుందని ఒక వాదన.
ఇలాంటి పరిస్థితులో ఇటు ప్రభుత్వానికి, కార్మికులకు ఇబ్బంది లేకుండా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్వరమే తీసుకుంటే ఉభయులకు బాగుంటుంది.ఇలా చేస్తే బాగుండవచ్చు
1. కనీసం 10 సంవత్సరాల పాటు ఒకే కేటగిరిలో పనిచేసినవారిని, తక్ష ణమే తరువాత పై కేటగిరీకి మార్చాలి.
2. అలా మార్చిన తర్వాత, వారిని పనితీరును మార్కుల రూపంలో కొలిచి, తగువిధంగా నెలవారీగా నగదు
బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇస్తూ, సంవత్సారాంతమున, వారి 12 నెలల మార్కులను సరాసరి లెక్కగట్టి, ఉ త్తమ ప్రతిభ లేదా మార్కు లు వచ్చిన వారికి వారి పై క్యాటగిరికి మార్చి, తదనుగుణంగా వేతనం చెల్లించాలి.
3. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలో వీరికీ ఓటుహక్కు తప్పక కల్గించాలి.
4. ఒక పరిశ్రమలో ఒకే యూనియన్ సూత్రము ను యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి.
5. సుదీర్ఘ కాలంపాటుపనిచేసి, ప్రమాదవశాత్తు చని పోయిన లేదా దీర్ఘకాలిక రోగాల తో ఉద్యోగం కోల్పోయిన
కార్మికు కుటుంబాలలో ఒకరికి దినసరి వేతనం పై ఉద్యోగం ఇవ్వాలి.
6. 20 సంవత్సరా పాటు పనిచేసిన కార్మికులను బేషరుతుగా శాశ్వత కార్మికులుగా తీసుకోవాలి.
ఇలా పై విధంగా చేసినపుడు ` కార్మికులు ఎంతో ఉత్సాహముగా పనిచేస్తారు, ఇటు ప్రభుత్వము నకు ఉన్న మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవటమే కాక ,ఆర్ధికంగా కూడా ఎంతో మేలు చేకూరుతుంది.
No comments:
Post a Comment