ఈనాడు ఆదివారము ` 20 డిశంబర్ 2015 నుండి సేకరణ
సమాజం కోసం......( నాకు నచ్చిన మాట )
సమాజం కోసం......( నాకు నచ్చిన మాట )
ఇచ్చి పుచ్చుకోవడం అన్న భావన సృష్టి నిర్మాణంలోనే ఉంది. ఆదిలో మనిషిలోనూ ఉండేది. వికృతంగా ఆలోచిస్తూ ఆ ప్రకృతి సిద్ధమైన గుణాన్ని పోగొట్టుకున్నాడు. పిచ్చుక, కొండల్లో, కోనల్లో, గింజల్ని ఏరుకొని, తింటుంది. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన పాదాలకు అంటుకున్న చిన్న చిన్న విత్తనాల్ని అక్కడక్కడా జారవిడుస్తుంది. అవే మొలకెత్తి, మొక్కలై, చెట్లయి మహావృక్షాలు అవుతాయి. అలా ప్రకృతికి తిరిగి ఇస్తుంది. నదులు అంతే, మళ్ళీ వర్షా లు రావడానికి కారణం అవుతుంది. మనిషే.... మహా స్వార్థంగా వ్వవహరి స్తున్నాడు . పుచ్చుకోవడం తన హక్కుని అనుకుంటున్నాడు. ఇవ్వడం తన బాద్య తే కాదని తప్పించుకుంటున్నాడు. ఫలితంగా ప్రకృత్తి లో సమతుల్యం దెబ్బతింటోంది. సహజవనరులు హరించుకుపోతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రుతువులు గతి తప్పుతున్నాయి. ‘ ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యన్తే యజ్ఞ భావితా : ` ప్రకృతికి చెందాల్సింది ప్రకృతికి ఇస్తే, ,ప్రకృతి నీకు చెందాల్సినదేదో ఇస్తుంది. సమాజం విషయమములోనూ ఈ నియమమే వర్తిస్తుంది. ‘ పరస్పర భావయన్త : ’ .... ఒకరికొకరు సహకరించుకోవాలి. కర్మయోగంలో ఇదో కోణం . సక్తా : కర్మణ్య విద్యాంసో య థా కుర్వన్తి భారత
.....కర్మయోగీ, కర్మ యోగి కానివాడూ ఇద్దరూ మనుషులే . ఇద్దరూ కష్టపడే పనిచేస్తారు. కానీ, ఇద్దరి జీవన దృస్పథాలు వేరు. ఒకరు సమాజం గురించి ఆలోచిస్తారు. మరొకరు, తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు.
నలుగురి గురించి ఆలోచించేవారి జీవితమే ధన్యం. కర్మ యోగం అంటే ` సమాజానికి ఉపయోగపడే పనికూడా. సమాజంతో పంచుకోగా మిగిలింది నువ్వు అనుభవించాలి. అమృతం దేవలోకంలోనో మరెక్కడో లేదు. నువ్వు సమాజానికి అర్పించగా మిగిలిన సంపదే అమృతమంటే. జుకెర్ బర్గ్ తనకు తాను మిగుల్చుకున్న ఒక శాతం ఫేసుబుక్ వాటా... అచ్చమైన కర్మయోగే. అలాంటి వారిని ఏ కర్మా అంటుకోదు. రాజకీయ నాయకు వేల కోట్ల అవినీతి సొమ్ము భోషాణాలు ...... అచ్చమైన విషకుంభాలు. ‘ నీ కోసమే నువ్వు పోగేసుకునే సొమ్ము పాపంతో సమానం ! నువ్వు తినేది అన్నం కాదు, విషాహారమని గుర్తుంచుకో. ఆ రక్తపు కూడు నీకెందుకు ? ` అని హెచ్చరిస్తాడు. గీతాచార్యుడు. పంచుకోవడమే నీ గొప్పతనమేం కాదు, అదో బాద్యత. ఆ దానాల గురించి గొప్పగా చెప్పుకోవాల్పిన పన్లేదు. దానం చేసే అవకాశాన్ని నీ కిచ్చినందువల్ల ...నువ్వే అతనికి రుణపడి ఉన్నావు` అని స్పష్టం చేస్తాడు.
No comments:
Post a Comment