Tuesday, January 26, 2016

APGENCO ఉద్యోగులకు సన్మానం

ది. 26.01.2016, మంగళవారము ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, వారి ఆధ్వర్యములో APGENCO లోని  V.T.P.S లో పెన్షన్ విభాగ ఉద్యోగులకు , వారికీ 1998 ముందు రిటైర్ అయిన  ఉద్యోగులకు వేతన బకాయలు సంబందించిన బిల్లులను సకాలములో తయారుచేసి , వారికీ అందించినదుకు కృతజ్ఞతగా ఈ సన్మానం జరిపారు.
 ప్రభుత్వ ఉద్యోగులు తమ విదులను సక్రమముగా ,నిజాయతీగా నిర్వహిస్తే ప్రజలనుండి ఎటువంటి స్పందన వస్తుందో ఈ  సన్మానం తెలియజేస్తోంది . 
Dy.Chief Controller of Accounts సోమేశ్వర రావు , మాట్లాడుతూ, మా టీం అంతా ఎంతో కష్టపడి , ఈ వేతన బకాయలు ఇప్పించారని , రిటైర్ ఉద్యోగులకు,,  సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, అందిస్తున్న సేవలను ప్రశంసించారు.సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ - వేతన బకాయలు సంబందించిన బిల్లులను తయారు చేయటం మా విధిలో  భాగం గా  చేసామని , అయితే , మీరు చూపిస్తున్న ఆదరణ ను కాదనలేక ఈ సన్మానం కు ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రముములో - అకౌంట్స్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీతమ్మ, ఇతర సిబ్బంది ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ స్తానిక శాఖ అద్యక్షుడు రాఘవేంద్రచారి, కె. ఆచారి ,రాధాకృష్ణమూర్తి , తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment