Tuesday, January 26, 2016

passport

దయచేసి ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి

APGENCO ఉద్యోగులకు సన్మానం

ది. 26.01.2016, మంగళవారము ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, వారి ఆధ్వర్యములో APGENCO లోని  V.T.P.S లో పెన్షన్ విభాగ ఉద్యోగులకు , వారికీ 1998 ముందు రిటైర్ అయిన  ఉద్యోగులకు వేతన బకాయలు సంబందించిన బిల్లులను సకాలములో తయారుచేసి , వారికీ అందించినదుకు కృతజ్ఞతగా ఈ సన్మానం జరిపారు.
 ప్రభుత్వ ఉద్యోగులు తమ విదులను సక్రమముగా ,నిజాయతీగా నిర్వహిస్తే ప్రజలనుండి ఎటువంటి స్పందన వస్తుందో ఈ  సన్మానం తెలియజేస్తోంది . 
Dy.Chief Controller of Accounts సోమేశ్వర రావు , మాట్లాడుతూ, మా టీం అంతా ఎంతో కష్టపడి , ఈ వేతన బకాయలు ఇప్పించారని , రిటైర్ ఉద్యోగులకు,,  సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, అందిస్తున్న సేవలను ప్రశంసించారు.సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ - వేతన బకాయలు సంబందించిన బిల్లులను తయారు చేయటం మా విధిలో  భాగం గా  చేసామని , అయితే , మీరు చూపిస్తున్న ఆదరణ ను కాదనలేక ఈ సన్మానం కు ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రముములో - అకౌంట్స్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీతమ్మ, ఇతర సిబ్బంది ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ స్తానిక శాఖ అద్యక్షుడు రాఘవేంద్రచారి, కె. ఆచారి ,రాధాకృష్ణమూర్తి , తదితరులు పాల్గొన్నారు.



Monday, January 25, 2016

Nadipinchu na nava

o taraka

tavarahe tava deena

tavirahetavarahe tava deena

hariraha

పాలరాతి మందిరాన

మాటచాలదా

navvavave nachele

నీవేరా నా మదిలో

నీ మదిలో నేనే ఉంటే

Tuesday, January 19, 2016

ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలలో దినసరి వేతన కార్మికుల పరిస్దితి

                           ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థ లో దినసరి వేతన కార్మికుల పరిస్టితి


   ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలలో కొన్ని వేల మంది కార్మికులు దినసరివేతనం పై పనిచేస్తున్నారు. వీరిలో, ఏమీ చదువుకోని వారినుంచి, పి.జి, ఇంజనీరింగ్‌ లో డిప్లమా మరియు డిగ్రీ చదవినవారు వరకు  పనిచేస్తున్నారు. అయితే, వీరిలో వారు చదివిన చదువకు, చేస్తున్న విధులకు ఏ కొద్ది మందికో తప్ప ,సంబంధం ఉండదు.
   ఈ  విద్యుత్‌ సంస్థ లో దినసరివేతనం  పై పనిచేసే వారిని అన్‌`స్కిల్డ్‌, సెమి` స్కిల్డ్‌, స్కిల్డ్‌,  హైలీ స్కిల్డ్‌ గా విభజించారు. వీరు చేసే పనిని బట్టి, వారు తెచ్చిన సిఫార్సును బట్టి,అర్హత ను బట్టి వారిని ఆయా కేటగిరిలో నియమిస్తారు. వీరికి ఎటువంటి నియామక ఉతర్వులు ఉండవు. ఇక నియామకపు తేదీ మొదలు, కొన్ని దశా బ్డము ల పాటు అదే కేటగిరిలో మ్రగ్గవలసినదే ! దీనిలో  హైలీ ` స్కిల్డ్‌ ను ఎవరూ అనుభవిస్తున్నట్లుగా తెలియరాలేదు.
    వీరు ఇంత సుదీర్గ కాలంపాటు పనిచేయటానికి కారణం` ఏ నాటికైనా బేషరుతుగా శాశ్వత కార్మికులుగా గుర్తి స్తారన్నఆశ !. దీనికి తోడు పని తక్కువ,జీతం ఎక్కువ అనేది కూడా ఒక కారణంగా ఉంది.
    అయితే, ఈ సంస్థలో పని చేసే వారికి ఇస్తున్నగుర్తింపు గుర్రము, గాడిద కు ఒక రకంగానే ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా, వేతనంలో పెరుగుదల గానీ, లేదా కేటగిరిలో మార్పు గాని ఉండవు. దాంతో, ఇక్కడి కార్మికులలో నిరాశ, అలసత్వం కనిపిస్తాయి. సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన కార్మికుల ప్రమాదవశాత్తు గాని, అనారోగ్యం తో గాని మరణిస్తే, వారికుటుంబసభ్యులలో ఎవరికైనా దినసరివేతనం పై ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా అపురూపమైన విషయంగా ఉంది.
     ఇక వేతన విషయానికి వస్తే మూలవేతనం పై కరువుభత్యం గత కొద్దికాలంగా ఇస్తూఉండటంతో, కొంత వెసులబాటుగా ఉన్నా, పెరుగుతున్న ధరలను చూస్తే నిరాశగా మారింది.   కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధారంగా చేసే సి.పి.ఐ పాయిట్స్‌ కూడా నిరాశ పరిచేదిగానే ఉంది. గతంలో మూలవేతనం పై పెంపుదల ప్రతి రెండు సంవత్సరము లకు ఒకసారిగా ఉండేది.ఇప్పుడది ,  లేబర్‌ కమీనషనర్‌  గారు  ఎప్పుడు పెంచుతారో తెలియనిపరిస్థితి !
     ఈ కార్మికుల అవసరం ప్రభుత్వము నకు ఎంతో ఉంది, దశాబ్ధాములుగా చేస్తున్న వీరిని శాశ్వత కార్మికులుగా గుర్తించరు. ఎందుకంటే, శాశ్వత కార్మికులుగా గుర్తిస్తే, ప్రభుత్వము ఎంతో భారం పడుతుందని ఒక వాదన.                        
    ఇలాంటి పరిస్థితులో ఇటు ప్రభుత్వానికి, కార్మికులకు ఇబ్బంది లేకుండా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సత్వరమే తీసుకుంటే ఉభయులకు బాగుంటుంది.
             ఇలా చేస్తే బాగుండవచ్చు
    1.   కనీసం 10 సంవత్సరాల పాటు ఒకే కేటగిరిలో పనిచేసినవారిని, తక్ష ణమే తరువాత పై కేటగిరీకి మార్చాలి.
    2.   అలా మార్చిన తర్వాత, వారిని పనితీరును మార్కుల రూపంలో కొలిచి, తగువిధంగా నెలవారీగా నగదు
         బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇస్తూ, సంవత్సారాంతమున, వారి 12 నెలల మార్కులను సరాసరి లెక్కగట్టి,          ఉ త్తమ ప్రతిభ లేదా మార్కు లు వచ్చిన వారికి వారి పై క్యాటగిరికి  మార్చి, తదనుగుణంగా వేతనం చెల్లించాలి.
   3.   కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలో వీరికీ ఓటుహక్కు తప్పక కల్గించాలి.
  4.    ఒక పరిశ్రమలో ఒకే యూనియన్‌ సూత్రము ను యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి.
  5.    సుదీర్ఘ కాలంపాటుపనిచేసి, ప్రమాదవశాత్తు చని పోయిన లేదా దీర్ఘకాలిక రోగాల తో ఉద్యోగం కోల్పోయిన
        కార్మికు కుటుంబాలలో ఒకరికి దినసరి వేతనం పై ఉద్యోగం ఇవ్వాలి.
   6.   20 సంవత్సరా పాటు పనిచేసిన కార్మికులను బేషరుతుగా శాశ్వత కార్మికులుగా తీసుకోవాలి.
                       ఇలా పై విధంగా చేసినపుడు ` కార్మికులు ఎంతో ఉత్సాహముగా పనిచేస్తారు, ఇటు ప్రభుత్వము నకు ఉన్న మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవటమే కాక ,ఆర్ధికంగా కూడా ఎంతో మేలు చేకూరుతుంది.   

Sunday, January 17, 2016

ఆహార పదార్థాల వినియోగం ఫై మనదేశంలోనూ ఇలాంటి చట్టాలు ఉంటే బాగుండు !

22.01.2016,స్వాతి సపరివార పత్రిక నుండి సేకరణ 
ఆహార పదార్థాల వినియోగం ఫై మనదేశంలోనూ ఇలాంటి చట్టాలు ఉంటే బాగుండు !

Friday, January 15, 2016

బెంగుళూరులో పి.జి . బిచ్చగాళ్ళు

నాకు నచ్చిన మాట

                   ఈనాడు ఆదివారము ` 20 డిశంబర్‌ 2015 నుండి సేకరణ
                                                       సమాజం కోసం......( నాకు నచ్చిన మాట )

ఇచ్చి పుచ్చుకోవడం అన్న భావన సృష్టి నిర్మాణంలోనే ఉంది. ఆదిలో మనిషిలోనూ ఉండేది. వికృతంగా ఆలోచిస్తూ    ఆ  ప్రకృతి సిద్ధమైన గుణాన్ని పోగొట్టుకున్నాడు. పిచ్చుక, కొండల్లో, కోనల్లో, గింజల్ని ఏరుకొని, తింటుంది. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన పాదాలకు అంటుకున్న చిన్న చిన్న విత్తనాల్ని అక్కడక్కడా జారవిడుస్తుంది. అవే మొలకెత్తి,  మొక్కలై, చెట్లయి మహావృక్షాలు అవుతాయి. అలా ప్రకృతికి తిరిగి ఇస్తుంది. నదులు  అంతే,  మళ్ళీ   వర్షా లు రావడానికి కారణం అవుతుంది. మనిషే.... మహా స్వార్థంగా వ్వవహరి స్తున్నాడు . పుచ్చుకోవడం తన హక్కుని అనుకుంటున్నాడు. ఇవ్వడం తన బాద్య తే కాదని తప్పించుకుంటున్నాడు. ఫలితంగా ప్రకృత్తి లో సమతుల్యం దెబ్బతింటోంది. సహజవనరులు హరించుకుపోతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రుతువులు గతి తప్పుతున్నాయి. ‘ ఇష్టాన్‌ భోగాన్‌ హి  ఓ దేవా దాస్యన్తే  యజ్ఞ  భావితా : ` ప్రకృతికి చెందాల్సింది ప్రకృతికి ఇస్తే, ,ప్రకృతి నీకు చెందాల్సినదేదో  ఇస్తుంది.  సమాజం విషయమములోనూ  ఈ నియమమే  వర్తిస్తుంది. ‘ పరస్పర భావయన్త : ’ .... ఒకరికొకరు సహకరించుకోవాలి. కర్మయోగంలో ఇదో కోణం . సక్తా : కర్మణ్య విద్యాంసో య థా కుర్వన్తి భారత
              .....కర్మయోగీ, కర్మ యోగి కానివాడూ ఇద్దరూ మనుషులే . ఇద్దరూ కష్టపడే పనిచేస్తారు. కానీ, ఇద్దరి జీవన దృస్పథాలు   వేరు. ఒకరు సమాజం గురించి ఆలోచిస్తారు.  మరొకరు,  తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. 
నలుగురి గురించి ఆలోచించేవారి జీవితమే ధన్యం. కర్మ యోగం అంటే ` సమాజానికి ఉపయోగపడే పనికూడా. సమాజంతో పంచుకోగా మిగిలింది నువ్వు  అనుభవించాలి. అమృతం దేవలోకంలోనో  మరెక్కడో లేదు. నువ్వు సమాజానికి అర్పించగా   మిగిలిన సంపదే  అమృతమంటే. జుకెర్‌ బర్గ్‌ తనకు తాను మిగుల్చుకున్న   ఒక శాతం ఫేసుబుక్‌ వాటా... అచ్చమైన కర్మయోగే. అలాంటి వారిని ఏ కర్మా అంటుకోదు. రాజకీయ నాయకు వేల  కోట్ల అవినీతి సొమ్ము భోషాణాలు  ...... అచ్చమైన విషకుంభాలు. ‘ నీ కోసమే నువ్వు పోగేసుకునే సొమ్ము పాపంతో సమానం ! నువ్వు తినేది అన్నం కాదు, విషాహారమని గుర్తుంచుకో. ఆ రక్తపు  కూడు నీకెందుకు ? ` అని హెచ్చరిస్తాడు. గీతాచార్యుడు. పంచుకోవడమే నీ గొప్పతనమేం కాదు, అదో బాద్యత. ఆ దానాల గురించి గొప్పగా చెప్పుకోవాల్పిన పన్లేదు. దానం చేసే అవకాశాన్ని నీ కిచ్చినందువల్ల ...నువ్వే  అతనికి రుణపడి ఉన్నావు` అని స్పష్టం చేస్తాడు.

Thursday, January 14, 2016

SKCV CHILDREN,S Trust కు పాత బట్టల వితరణ

SKCV CHILDREN,S Trust,భవానిపురం ,విజయవాడ కు ఈ రోజు నేను పాత బట్టల ను అందజేసాను. ఈ సందర్భాముగా నేను తెలుసుకొన్న విషయాలు.
1. కందిపప్పు, బియ్యము, పెద్ద  XEROX MECHINE ను దాతల నుండి కోరుతున్నారు.
2 జనవరి 14 ను అనాథ బాలల పుట్టిన రోజుగా జరుపుకుంటారు
౩. ఆ ప్రాగణం లో 95 మంది బాలురు, 125 మంది సిబ్బంది ఉన్నారు.
4. దయతో ఇచ్చిన వాటికి రసీదు ఇవ్వరు.
5. పేరు, అడ్రస్,ఫోన్ నెంబర్ రాసుకొంటారు.
ఎవరినా దాతలు విరాళము ఇవ్వదలిస్తే సెల్ నెంబర్ : 9581296999 ను సంప్రదించండి.
అక్కడ నేను తీసిన ఫోటోలు ,కృష్ణ నది ఒడ్డున ఉన్న ఆశ్రమం ఇది.
photos

PORTABLE TWO WHEELER

Sunday, January 10, 2016

చిన్నారి మేధావి –సాయి సుజన్ (Sai sujan)

                               చిన్నారి మేధావి –సాయి సుజన్

కొండపల్లి కి చెందిన సాయి సుజన్ కిలిమి- 9 సంవ్సత్వరాల వయస్సులో ఈ విద్యార్ధి చూపుతున్న అసమాన జ్ఞాపక శక్తి- అందరిని అబ్బుర పరుస్తోంది.
 ఆదర్శ విద్యానికేతన్ – కొండపల్లి (కృష్ణా జిల్లా) లో L.K.G చదువుతున్నప్పుడు, తల్లి ఇంటి దగ్గర నేర్పించిన రాష్ట్రాలు-  వాటి రాజధానులు,రాజకీయనాయకులు, దేశభక్తి గేయాలు , వాటి రచయితలు,--- ఇలా జనరల్ నాలెడ్జి కి సంబంధించినవి , నేర్పుతున్నప్పడు, వెంటనే వాటిని గుర్తుంచి,చెప్పటం-ఆ తల్లిని ఆశ్చర్యపరిచింది. తన బిడ్డ లోని అబ్బుర పరచే జ్ఞాపక శక్తి ని పదిమంది కి తెలపాలన్న ఉద్దేశంతో ,ఆ స్కూల్ correspondent అయిన  హబిబుల్లా గారిని కోరినప్పుడు,వారు సంశయిస్తూనే ,  స్కూల్ వార్షికోత్సవము లో మొదటసారిగా అవకాశం ఇచ్చారు. అప్పుడు ,ఈ కుర్రాడు చూపించిన ప్రతిభకు  అందరి చేత  శెభాష్  అనిపించుకున్నాడు.
                               అది మొదలు ,సాయి సుజన్ ప్రస్థానం మొదలయ్యంది.
తరువాత, ఇతని తల్లి దుర్గా రాణి – సాక్ఖి ఛానల్ లో వస్తున్నా SPELL-BEE, కార్యాక్రము (అంటే ఇంగ్లీష్ పదాలకు కొద్ది సెకన్లో ఆ పదానికి చెందిన స్పెల్లింగ్ చెప్పగలగటం) లో ఒక చిన్నారిని శాలువతో,సత్కరించటం చూసి ,తన బిడ్డను కూడా, ఆ ప్రోగ్రాంలో పాల్గొనేలాచేయాలనుకుంది . కానీ ఎలా? ఎవరిని అడగాలో తెలయదు? చివరకు,  సాక్ఖి దిన పత్రిక విలేఖరి ఆదిశేషు గార్ని కలిసి వివరాలు తెలుసుకొని, విజయవాడ, ఆటో నగర్ లో ఉన్న ఆ పత్రిక కార్యాలయమునకు వెళ్లి , తన బిడ్డ ఆ కార్యక్రముములో పాల్గొనెలా చేసింది.   విజయవాడ లో జరిగిన మూడు స్థాయిలలో గెలిచి , హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి  ఫైనల్ రౌండ్ పోటీలో, 4వ స్థానం సంపాదించాడు .  తరువాత, ఇదే ఛానల్ వారు నిర్వహిస్తున్న MATHS-BEE  కార్యక్రమము లో  పాల్గొన బోతున్నాడు.
         ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించిన, ఆశయస్పూర్తి ఫౌండేషన్‌వారు , మార్చి2014లో  ఇతని గురించి విచారించి, మరింత ప్రోత్పాహించాన్న ఉద్దేశ్యముతో, ఇతనికి ఆసక్తి కలిగిన గేమ్‌ అయిన చదరంగం లో తగు కోచింగ్‌ ను ఇప్పించి(అందుకు అయ్యే ఖర్చును భరించి),టోర్నమెంటు స్తాయికి తీసుకెళ్ళారు. అంతే కాదు, ఇతని కుటుంబ ఆర్ధిక స్థితిని గమనించి, ప్రతినెల రూ॥ 500/ ను, కేంద్ర ప్రభుత్వ పథకములో జమ చేస్తున్నారు.
     చదువుతున్నారు, మరియు వారి ఆసక్తి ని గమనించి ప్రోత్పాహించాలి.
ఈ మేధస్సు కు కారణం బహుశ సాయిసుజన్‌ మేనమామ నుంచి వచ్చిఉండొచ్చని అతని తల్లి అభిప్రాయపడ్డారు.
    ఈ చిన్నారిని Vijayawada children's schools and tutorials Association వారు 2012  మరియు 2015   నిర్వహించిన states and capitals and spelling test లోను, sakshi SPELL BEE ,కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహించిన జ్ఞాపకశక్తి, మరియు క్విజ్ పోటీలో, NEHRU YUVA KENDRA, VIJAYAWADA వారి G.K  పోటీలో - పాల్గొని  అన్నిటిలోనూ ప్రధమ బహుమతి పొందాడు.
అంతే కాదు , ఈ విద్యార్థికి  పౌరాణిక పాత్ర వేషధారణలో కూడ ప్రవేశం ఉన్నది.
      ఈ చిన్నారి గురించి చినుకు మాస పత్రిక కూడా తన ఫిబ్రవరి 2014 సంచిక లో U.K.G లో G.K బుడుగు పేరున ఒక వ్యాసం వ్రాయటం జరిగింది.
 ఇతని విజయం వెనుక తల్లి పాత్ర ఎంతో ఉన్నది. ఆమె మాటల్లో చెప్పాలంటే , పిల్లలను స్కూల్ లో చేర్పించి లేదా TUITION లో చేర్పిస్తే మన పని అయిపొయింది అని తల్లిదండ్రులు అనుకోకూడదు. వారు ఏమి ప్రస్తుతం నాగార్జున స్కూల్ లో ౩ వ తరగతి చదువుతున్న ఇతనికి , స్కూల్ యాజమాన్యం ఎటువంటి ఫీజులు తీసికోకుండా  ENCOURAGE చేస్తున్నారు.
    సాయి సుజన్ ను భవిషత్తులో ఏమి అవుతావని అడిగినప్పడు I.A.S అవుతానని తెలిపాడు.  
      అయితే , కేవలం తల్లి మాత్రమే ఇతని బాగోగులు చూడటం వల్ల, ముందు ముందు, ఈ చిన్నారి ఎదుగుదలకు ,ఆర్ధిక ఇబ్బందులు ఎదురవచ్చు.  కాబట్టి దాతల ముందుకొచ్చి సాయం అందిస్తే , ఇతను మరింత రాణిస్తాడు అనటంలో సందేహమే లేదు . 










Thursday, January 7, 2016

అమెరికా చదువులు

         అమెరికా చదువులు
గత కొద్ది కాలముగా, తెలుగు విద్యార్డులెందరో  అమెరికాకు ఉన్నత చదువుల నిమిత్తము వెళ్ళటం ,అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులతో ముఖాముఖి తలపడ లేక ,తిరిగి ఇండియా కు రావటం పరిపాటి గా మారింది .
అమెరికా లోని రెండు ప్రముఖ యూనివర్సిటీ ల పేర్లు చెబుతూ , అవి బ్లాక్ లిస్టు లో ఉన్నవని పుకార్లు పుట్టించటం , అమెరికాకు ఎందునిమిత్తం వచ్చారన్న ప్రశ్నకు బాంబులేయటానికి వస్తామా అని, మనవిద్యార్డులు,  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో వేళాకోళం గా మాట్లాడడటం, అసలు అమెరికా ప్రభుత్వ మే ఇలా రెచ్చ గొట్టటం చేస్తున్నదా ? ఇవ్వన్ని గమనిస్తూ భారత ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరించటం చూస్తుంటే - సామాన్యుడుకి ఇది  ఒక అర్థం గాని  విషయం గా  మారింది !
సాధారణముగా ,అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టు లో వున్న విశ్వవిద్యాలయముల జాబితా ని ఆయా దేశాలలోని తమ రాయబార కార్యాలయములకు పంపుతుంది. లేదా సంబందిత వెబ్ సైట్లను గమనించినా విషయం తెలుస్తుంది . అక్కడి విశ్వవిద్యాలయములలో చదవాలుకొనే విద్యార్థులు అక్కడి పరిస్తితులు గురించి , వారితో వ్యవహరించవలసిన విధానాల ఫై సరయిన విధానము తెల్సుకోకపోవటం ప్రధాన లోపముగా కనిపిస్తోంది. ముఖ్యముగా, అమెరికన్ లు మాట్లాడే ఇంగ్లిష్ ఏస ను అర్థం చేసుకోలేక పోవటం, ఈ విషయం లో తగు సాధన చేయక పోవటం , ఎడ్యుకేషన్ కన్సులంట్ల  మీద పూర్తి భారం వేసి కూర్చోవటం, కూడా ఒక లోపం గ వున్నది.
        అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ,మీరు ఇక్కడ విద్యాభ్యాసమునకు , ఆర్ధిక వనరులు గురించి అడిగినప్పుడు, పార్ట్ టైం జాబు చేసి సంపాదిస్తూ చదువుకుంటామని, నిషేధిత సమాధానములు చెప్పడటం చూస్తుంటే సరియిన అవగాహన లేకుండగానే,అమెరికాకు పయనమయ్యారని తెలుస్తోంది .
మొదట వెళ్ళిన వారు ఫై విధముగా సమాధానాలు చెప్పటం తో, అప్రమత్తమయ్యిన  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తరువాత వచ్చే వారి విషయములో ఖటినముగా వ్యవహరించి, వారు ఏమి చెబుతున్నారో వినే ఓపిక కూడా లేకుండా విపరీత అసహనముతో మన వారిని 12 నుండి 24 గంటల పాటు నిర్బంధించి (ఏదో ఖైదులులాగ ),చిత్రహింసలకు గురి చేసి ,మానసిక క్షోభ కు గురిచేశారు.
 ఈ సందర్భముగా ,మన విద్యార్థులు తెలుస్కోవాల్సిన విషయం ఒకటున్నది, అది ఏమంటే , మీ ఫేస్బుక్ ఎకౌంటు లో మీరు పోస్ట్ లేదా చాంటింగ్ చేస్తున్న, మరియు షేర్ చేస్తున్న విషయాలను బట్టి మిమ్ములను అంచనా  వేయటం జరుగుతోంది. ఇది మీ భవిష్యత్తు ఫై ప్రభావం చూపే పరిస్తితి నేడు ఉన్నది.
ఇదిలా ఉంటే, అమెరికా లోని మన తెలుగు సంఘాలు మీకు ఏ కష్టమొచ్చినా చెప్పండి , మేమున్నాం అంటూ నెమ్మదిగ స్పందించాయి. అయినా, మీరు సరియిన అవగాహన లేకుండా అమెరికా లో చదువులకు రావటం ఏమిటి అన్నట్లు ఉన్నాయి వీరి మాటలు. ఇన్ని కబుర్లు చెప్పే వీరు- ఇక్కడి విద్యార్థులకు  ఈ విషయాల ఫై అవగాహన శిబిరాలను నిర్వహించవచ్చు కదా !
        ఇప్పడు భారత ప్రభుత్వ వైఖరి చూద్దాము – తెలుగు వాడు అనే టప్పటికి కేంద్రముకు కూడా లోకువ లా ఉంది. ఈ పరిస్తితుల ఫై అమెరికా ప్రభుత్వం తో మాట్లాడి , ఈ సమస్యకు చక్కని  దారి చూపి విద్యార్థుల భవిష్యత్తు కు మంచి బాట చూపవల్సినది   పోయి, నిమ్మకు నీరెత్తినట్లు   కూర్చుది.
వీటన్నిటికి కారణం, బట్టి చదువులు, గుమాస్తాలను తయారు చేసే మన విద్యా వ్యవస్థ , ఈ  వ్యవస్థ ను   బాగుచేసే పనికి నడుం కట్టకుండా అలసత్వం ప్రదర్శించే  మనము -  కాదంటారా !


 






Tuesday, January 5, 2016

ప్రభుత్వ ఆసుపత్రి లో పళ్ళు,దుస్తులు వితరణ

ది. 06.01.2016. బుధ వారము ఉదయము 12 గంటలకు పాత ప్రభుత్వ ఆసుపత్రి (విజయవాడ) లో మాతా శిశు విభాగం లో ఈ రోజు జన్మించిన శిశువులకు నూతన వస్త్రాలు, బిస్కట్ పాకెట్స్ లను దాదాపు 40 మంది కి  ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ , ఇబ్రహింపట్నం వారు పంచటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమునకు చక్కని సాయం అందించారు. ఈ కార్యక్రమములో జే.డి, రహమత్,చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Do you want a reliable and sincere spare car driver ?

NALLAMOTHU DURGA PRASAD, (J.D) Near Ibrahimpatnam Post office ,Zakir hussain collage road,Ibrahimpatnam-Krishana(D.T) Cell : 7799525143.

photo grapher


Friday, January 1, 2016

1104 యూనియన్ - నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఎలట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104 )  ప్రాతీయ శాఖ -- స్టానిక విద్యుత్ అధికారులను  కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం జరిగింది. చీఫ్ ఇంజనీర్ శ్రీ రావి ప్రభాకర రావు మాట్లాడుతూ సంవత్సరము  అందరమూ  కష్టించి ఇప్పుడు ప్లాంట్ కున్న పేరు నిలపాలని కోరారు .  తెలంగాణలో పనిచేస్తున్న మన ఆంధ్రా సోదర కార్మికుల పరిస్తితి కి చింతిస్తున్నాను అని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు రావల్సిస్ని పెరిగిన వేతనాలు- సంక్రాంతి కి అందేలా ప్రయతిస్తున్నాం అని తెలిపారు . కోల్ ప్లాంట్ ఎస్.ఇ శ్రీ రాములు మాటలాడు తూ పదవీ విరమణ పొందు తున్న కార్మికుల స్తానములో కొత్త వారని నియ మిచా లని అభిప్రాయ పడ్డారు.  సివిల్ ఎస్.ఇ సుబ్బారావు గారిని కలిసి నూతన నిర్మాన దశ లో కార్మికుల పిల్లలకు కాంట్రాక్టు లేబెర్ గా నియమిచుటకు ప్రాధాన్యత నివ్వల్లని కోరగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రముములో రీజనల్ ప్రెసిదెంట్ దాసు, సెక్రటరీ శ్రీనివాస్ , రమణయ్య, నాగేశ్వర రావు, పటేల్, ధన మూర్తి, కొండపల్లి అప్పా రావు, ప్రసాద్, సత్యనారయణ ,మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆశయ స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యము లో అన్నదానము

ది.01-01-2016 న  ఆశయ స్పూర్తి ఫౌండేషన్  ఆధ్వర్యము లో అన్నదానము కార్యక్రమము,,కొండపల్లి లో జరిగింది. నూతన సంవస్తరము సందర్భముగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రముములో అన్నము ,సాంబారు ,కూర కలిగిన అన్నము కలిపినా పాకెట్స్ ను కొండపల్లి లోని పలు మసీదుల వద్దనున్న పేదలకు పంచటం జరిగింది. ఈ కార్యక్రములో రహమత్, చందు,ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు.

ఫొటోస్