A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Monday, May 23, 2016
Monday, May 16, 2016
Tuesday, May 10, 2016
Monday, April 25, 2016
కాలుష్యం
కాలుష్య నివారణకు మనము ఏమి చేస్తున్నామని ,ఎవరికివారే ప్రశ్నించుకొండి ? శబ్ద కాలుష్యం,గాలి,నీరు,ఇలా అన్నిటిని కలుషతమ్ చేస్తున్నాము. మనకు తెలియక చేసేవి ఏమి కావు . తెలిసే చేస్తున్నాము. కొంత మన ఉదాసీన వైఖరి. మనం ఇబ్రహింపట్నం రింగ్ సెంటర్ నుండి కొండపల్లి వెళ్ళే దారిలో ఫిల్టర్ హౌస్,మరియు కొత్తగేటు పరిసరాలలో ,సెప్టిక్ ట్యాంకుల నుండి తీసిని వ్యర్హ్దాలను , రోడ్ ప్రక్కనే పోస్తున్నారు. గ్రామ పంచాయితి లు ఈ విషయం పట్టనట్టే ఉంటాయి. ఇవి భూ గర్బ జలాల్లోకి ప్రవేశిస్తే ఎంతః ప్రమాదం. అలాగే, చికెన్ సెంటర్ లనుండి వచ్చే వ్యర్ధాలు కూడా ఇలాగే పడేస్తున్నారు.
ఈ రకంగా గాలి, నీరు కలుషితం అవుతున్నాయి .. దేవాలయములు,మసీదులు, క్రై స్తవ మహాసభ ల నుండి వచ్చే శబ్ద కాలుష్యం అంతా,ఇంతా కాదు. మనం దేవుడ్ని ప్రార్దిన్తున్న విషయం, లౌడ్ స్పీకర్ లో అరచి మరి చెప్పవలిసిన పని ఏముంది.
దయ చేసి ఆలోచించండి|

Sunday, April 24, 2016
ఆసయస్పూర్తి ఫౌండేషన్ వారి నిర్వహణ లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016 నిర్వహణ
ఆసయస్పూర్తి ఫౌండేషన్ వారి నిర్వహణ లో ఈ రోజు అనగా ది.24.04.2016(ఆదివారము) ఉదయం 8.30 నుండి12.00గంటల వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016 జరిగింది. మండల స్తాయిలో జరిగిన ఈ కార్యక్రమములో దాదాపు 60మంది విద్యార్థిని,విద్యార్ధులు పాల్గొన బోతున్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష -2016, ఈ నెల 27.04.2016,జరగబోతున్నది. ఈ పరీక్ష కు కేవలం మూడు రోజులు ముందుగానే ఈ పరీక్ష నిర్వహించటం వల్ల విద్యార్ధులకు తమ ఏ స్తాయి లో వున్నారో తెలుసుకొని ,మరింతఃగా బాగా పరీక్షకు ప్రిపేర్ అవటానికి ఈ నమునా పరీక్ష,ఉపయోగపదినదని విద్యార్థిని,విద్యార్ధులు తెలిపారు .
ఈ కార్యక్రమానికి Sub-Inspectior of Police, Advocate, Amurtha Sai college of Engineering H.O.D(E.E.E) అంకమ రావుగారులు అతిధిలుగా వచ్చి విద్యార్థిని,విద్యార్ధులు స్ఫూర్తి దాయకమైన ప్రసంగములు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం లో రహమత్ గారు ,అక్బర్,నిజాం, లు ఎంతో కష్టపడ్డారు. శాదిఖానా యాజమాన్యం కూడా ఎటువంటి రుసుము అడగకుండా సహకరించారు. సాయి,వెంకి,చంద్రశేఖర్,వినీల,నిర్మల తదితరలు వారి సేవలు అందించారు. RAO PUBLICATION ,విజయవాడ వారు,పేపర్స్ సెట్ చేయటం లో తమ సేవలు అందించారు.
sakhi

![]() |
| పరీక్ష రాస్తున్న విద్యార్దులు |
Friday, April 22, 2016
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016
ఆసయస్పూర్తి ఫౌండేషన్ వారి నిర్వహణ లో రేపు అనగా ది.24.04.2016(ఆదివారము) ఉదయం 8.30 నుండి12.00గంటల వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016 జరుగును. మండల స్తాయిలో జరుగు ఈ కార్యక్రమములో దాదాపు 70మంది విద్యార్థిని,విద్యార్ధులు పాల్గొన బోతున్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష -2016, ఈ నెల 27.04.2016,జరగబోతున్నది. ఈ పరీక్ష కు కేవలం మూడు రోజులు ముందుగానే ఈ పరీక్ష నిర్వహించటం వల్ల విద్యార్ధులకు తమ ఏ స్తాయి లో వున్నారో తెలుసుకొని ,మరింతఃగా బాగా పరీక్షకు ప్రిపేర్ అవటానికి ఈ నమునా పరీక్ష,ఉపయోగపడుతుందని ,కాబట్టి విద్యార్థిని,విద్యార్ధులు ఈ అవకాసమును వినియోగించు కోవల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
స్తలము : షాదిఖానా ,కొండపల్లి
సమయము : ఉ : 8.30 నుండి12.00 వరకు
తేది : 24.04.2016,ఆదివారము
రిజల్ట్‌లు తెలుపునది : అదే రోజు 12.30 pm.
First Cash prize : Rs.3000/,Second Cash prize :Rs.2000/ మరియు మూడు మరియు నలుగు స్టానాల వార్కి కూడా బహుమతులు కలవు. ఎంట్రీ ఫి : రూ :100/ మాత్రమే .

Wednesday, April 20, 2016
బెంగుళూరు ` మైసూరు పర్యటన ` నా అనుభవాలు (చివరి భాగము)

తర్వాత రోజు(15.04.2016) శుక్రవారము,శ్రీరామనవమి కూడా అయినది. ఉదయం 6.30ని॥కు ఇన్నోవా(ఎ.సి) కారులో మైసూరు పర్యటనకు బయుదేరాము. ముందుగా శ్రీరంగపట్నం లోని రంగనాథస్వామి ని,అమ్మవారిని దర్శించుకున్నాము. స్వామి విగ్రహం చూస్తే మనకు ఒక రకమైనా తన్మయత్వం గా ఉంటుంది.
ఆ తదనతరం` మైసూర్ చేరాము. టిప్పుసుల్తాన్ సమాధి,టిప్పుసూల్తాన్` ఆంగ్లేయులను బంధించిన కారాగారము (వాటర్జైలు) చూసాము. వాటర్ జైలు గురించి కొంత వివరిస్తాను. అక్కడి సెక్యురిటీ గార్డు హిందీ లో చెప్పిన వివరము బట్టి` టిప్పుసుల్తాన్ కేవలము ఆంగ్లేయ అధికారులను మాత్రమే చంపేవాడు. సాధారణ సైనికులను మాత్రమే ఈ వాటర్ జైలు లో శిక్షించేవాడు. వారిని దీర్ఘ చతురు సాకారము చీకటి గదిలో , చేతులు కట్టివేసి,మెడవరకు నీటిలో వారిని ఉంచేవాడు, ప్రతి 24గం॥ కు ఒకసారి ఆ నీరు ను తీసివేసి,వారికి ఆహారము అందజేసి,తిరిగి నీటిలో బంధించేవాడు. పక్రన్న ఉన్న కావేరినది నుండి నీటిని గురుత్వాకర్షణ పద్ధతి ద్వారా నీరుని వాటర్ జైలుకు తీసికువచ్చేవారు. కాని, ఇప్పుడు చూస్తే కావేరి నది , అక్కడ ఒక చిన్న పాయలా మాత్రమే ఉంది.
అక్కడనుండి` మైసూరు ప్యాలస్ కు వెళ్ళాము. ప్రవేశరుసుము చెల్లించిన తర్వాత, లోపలికి ప్రవేశించాము. సాలార్జంగ్ మ్యూజియం లాగానే ఇదికూడా ఉంది. అనాటి మైసూరు రాజులువాడిన దుస్తులు,వారికొచ్చిన బహుమానాలు, వారి కుటుంబీకుల చిత్రపటాలు, అప్పటి వారిసైన్యం విశేషాలు, వారి అంత: పురము,ఉత్సవాలు జరిగేటప్పుడు రాజుగారు, వారి కుటుంబీకులు,అతిధిలు,ఇతర ప్రజలు కూర్చొనే ప్రదేశము చూశాము. ఆరోజుల్లో ఉన్న చెక్కను అందంగా చెక్కిన తీరు, ఫాల్స్ సీలింగ్ గా అమర్చిన విధానం చూసితీరవలసినదే ! ఇక్కడ మనము కొంత డబ్బు చెల్లిస్తే, ఆడియో సిస్టం ద్వారా మనకు హెడ్ ఫోన్ తో ప్రతి వస్తువు దగ్గర వారు ఏర్పాటుచేసిన నెంబరు తెలిపితే , ఆ వస్తువు వివిరాలు చెబుతారట. అన్ని ప్రభుత్వసెలవుదినాలో, ఇక్కడి ప్యాలస్ కు ఉన్న 1008లైట్లను సాయంత్రం 7గం॥ నుండి 7.30గం॥వరకు వెలిగిస్తారుట. అప్పుడు ,ప్యాలస్ చూస్తే ఇంకాబాగుంటుందిట. ప్యాలస్ చూట్టూ పురాతన దేవాలయము,రాజవంశీకులు మాత్రమే వచ్చే గేట్లు, పనివారు వచ్చేగేట్లు ఇలా రకరకాల ద్వారాలు ఉన్నాయి.
ఇక ఇక్కడి నుండి బృందావన్ గార్డ్‌న్ కు చేరాము.
బృందావన్ గార్డ్‌న్ నుండి కేరళ రాష్ట్రం కేవలం 70కి॥మి. దూరమట. ఆరోజు ,మాకు ఎక్కువగా మళయాళీయులు కనిపించారు. ఈ గార్డెన్ అంత గొప్పగా ఏమీలేదు. పాత సినిమాలో ఇక్కడి పూల అందాలు చూపించటంతో మనకు కొత్తగా అనిపించదు. వాటర్‌ఫౌంటెన్,విద్యుత్ దీపాలమవెలుగులో కొత్త అందం వచ్చినట్లుగా ఉంటుంది. సాయత్రం 7.30గం॥ నుండి 8.00గం॥ మ్యూజికల్ ఫౌంటెన్ ఉంటుందిట. సమయం లేక పోవటంతో చూడలేకపోయాం.
అక్కడినుండి బయుదేరి రాత్రి11గం॥కు బెంగుళూరులోని మేము బసచేసిన హోటల్ కు చేరాము.
IIIIIIIIIIIIIIIIII
తర్వాత రోజు ది.16.04.2016(శనివారము),మా బంధువు ఇంట్లో బసచేసి,మధ్యాహ్ననం 4గం॥కు యెలహంక రైల్వేస్టేషన్ నుండి కాచీగూడ ఎక్స్‌ప్రెస్ లో ది.17.04.2016 ఉదయం5.30గం॥హై దరాబాద్ చేరాము.
తిరుగు ప్రయాణంలో, ఒక సంఘటన: మా బృందంలో 11సం॥ మా తమ్ముడి కూతురుకి వేడికి, లేదా ప్రయాణ అలసట వ్డుల్ల కడుపులో ఇబ్బందిగాను ఉండి,శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ఈ బాధ రాత్రి 7.30గం॥ మొదలు అయితే,మేము ఎక్ట్రోల్ పౌడరు,మా దగ్గర మాత్రలు వేసినా ఫలితం లేక పోయింది. దాంతో, రైల్వే వారి ఎమర్జెన్సీనెంబర్138 కు డయల్ చేస్తే ,మీ ట్రయిన్ టి.సి కి చెప్పమన్నారు. ఆయన సెల్ నెంబరు చెప్పమంటే మాకు తెలియదని సమాధానం చెప్పారు. మొత్తానికి ఎలాగో,ఆ టి.సి పట్టుకుని విషయం చెబితే, ఆయన వెంటనే,సంబంధిత అధికారికి ఫోన్ చేసి,తర్వాత స్టేషన్ అయిన డోన్ లో మీకు వైద్యసహాయం అందుతుందని తెలిపారు. డోన్ వస్తే, అక్కడ డాక్టర్ లేడు.అప్పటికి రాత్రి11.30గం॥ ,అడిగితే ఎవ్వరూ అందుబాటులో లేరని, మరి ఎక్కువగా ఉంటే తర్వాత స్టేషన్ అయిన కర్నూలులో దిగిపోండని,అక్కడి ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ ఉచిత సలహ. టి.సిని అడిగితే, తన సంబంధిత అధికారి పలుమార్లు పి.ఎన్.ఆర్. నెంబరు అడగటమేగాని,అంతకు మించి స్పందన కన్పించటంలేదని వాపోయాడు. ఎట్టకేలకు,ఒక లేడీ డాక్టర్ వచ్చి ,ఏవో మందులిచ్చి, రూ॥100/ చార్జ్ చేసివెళ్లింది. ఈ ఇబ్బందిలో మాకు పూర్తిగా అండగా ఉంది,టి.సి విక్రమన్
ఎంతో ఓపిగా ఈ రచన చదివిన మీ అందరాకు నా ధన్యవాదాలు. మీ విలువైన కామెంట్స్ పెట్టగలరు.
.

Monday, April 18, 2016
బెంగుళూరు - మైసూరు పర్యటన - నా అనుభవాలు
బెంగుళూరు - మైసూరు పర్యటన - నా అనుభవాలు
ది.13.04.2016 , బుధవారము, రాత్రి 9గం॥ కు ,ట్రయిన్ నెం 17603 కాచీగూడ` యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ లో,మా కుటుంబము మరియు మా తమ్ముడి కుటుంబము (మొత్తం 8 మంది),కలిసి బెంగుళూరు - మైసూరు పర్యటనకు బయలుదేరాము.
బెంగుళూరు లో యశ్వంతపూర్ స్టేషన్ దగ్గర దిగేసరికి ది.14.04.2016,గురువారము ఉదయం 10.30గం॥ అయినది. మండుటెండలో, నాన్` ఎ.సి కారులో బెంగుళూరు లోని మోడ్రన్ హోటల్ లో ,రెండు నాన్` ఎ.సి రూములో బస చేశాము. ప్రయాణబడలికతో మాకు దొరికిన ఆ హోటల్ లో ఎ.సి రూము లేవన్నా దిగిపోయాము.
స్నానపానాదులు,భోజనాలు తర్వాత మధ్నాహ్నం 3గం॥ కు బయలు దేరి కారులో విధానసభ(రోడ్డుపైనుండి చూడటమే),తర్వాత లాల్బాగ్ (బొటానికల్ గార్డెన్) కు వెళ్ళాము. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో కనిపించే కొన్ని రకాల దృశ్యాలే ఇక్కడా కనిపిస్తాయి ! వెరసి, నా అనుభూతి ప్రకారం అయితే, హైదరాబాద్ లోని పబ్లిక్‌గార్డెన్ కంటే గొప్పగా ఏమీలేదు.
తర్వాత, ఇక్కడి నుండి ఇస్కాన్ టెంపుల్ కు వెళ్ళాము. చాలా పెద్ద శ్రీకృష్ణ దేవాలయము. విదేశాలనుండి భక్తు లుపంపే విరాళాలతో నడుస్తున్నదని వినికిడి.ఇక్కడి ప్రతి ఒక్కటి పద్దతిగా ఏర్పాటు చేశారు, పాదరక్షలు భద్రపరిచే ప్రదేశములో ఏర్పాట్లు(ఇక్కడి డబ్బు చెల్లించాలి),వాహనప్రవేశము,చల్లని మంచినీరు అందించే ఏర్పాటు,పూజావస్తువులు,భక్తిపుస్తకాలు,సి.డిలు , ఉచిత ప్రసాద వితరణ,సాయత్రం వేళ ‘హరేరామ,హరే కృష్ణ’ నామ సంకీర్తన అన్నీ బాగున్నాయి.
ఇహ ఇక్కడనుండి,‘ ఒరియానొ(ORION) ’ అనే అతిపెద్ద షాపింగ్ మాల్ కు వెళ్ళాం. ఇక్కడి దుకాణాలు, వాటి ధరలు అవే కొనేవారిని చూస్తే నాకైతే ఇండియాలోనే ఉన్నామా, అనిపించింది. ఇక్కడ చీర కట్లుకున్న ఆడవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. పెద్ద,చిన్న అని లేదు ` అందరు చుడీదార్లు,స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు,షార్టులు .......... ఈ మాల్ లోనే బార్ కూడా ఉంది. అదేదో ప్యామిలీ రెస్టారెంటు లాగా, ఆడ,మగ కలిసి తాగటం,నాకు మాత్రం వింతగానే ఉంది. ఆ ప్రక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. చల్లగాలికి అక్కడ కూర్చొందామని వెళ్ళాం. కానీ, అది కూడా ఆ గేట్డ్ కమ్యూనిటీ లో ఉన్నఅపార్టుమెంట్ వారికి మాత్రమే అని అక్కడి సెక్యురిటీ సిబ్బంది , మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అక్కడినుండి, మేము బసచేసిన హోటల్ కు తిరిగి చేరాము. ఈ బెంగుళూరు నగర పర్యటన లోమాకు ఎంతో సహకరించిన నా మేనకోడలు శ్వేత,ఆమె భర్త కృష్ణ కు ధన్యవాదములు
(రేపు మైసూర్ పర్యటన విశేషాలు)
Friday, April 8, 2016
ఆశయస్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యము లో చల్లని మజ్జిగ పంపిణి
ది. 08.04.2016(శుక్రవారము) ఉదయం 11గంటలకు, ఇబ్రహింపట్నం
రింగ్ సెంటర్ లో దుర్ముఖి నామ సంవత్సరం
సందర్భముగా,ఉగాది
పచ్చడి మరియు చల్లని
మజ్జిగ ను ఆశయస్పూర్తి
ఫౌండేషన్ ఆధ్వర్యము లో పంపిణి చేసారు. Sub-inspector of Police
,ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ ,శ్రీనివాస్ గారు ,వచ్చి ఈ కార్యక్రమము ను
ప్రారంభించారు. మందు వేసవి లో చల్లని మజ్జిగ ను పంపిణి చేయటం ద్వారా చాలా
మంచి చేస్తున్నారని ఫౌండేషన్ కార్యకర్తలను అభినందిస్తు ,భవిషత్తులో మరిన్ని మంచి
కార్యక్రమాలు చేయాలనీ కోరారు.
ఎంతో మంది వాహన చోదకులు, ప్రయాణికులు, ఈ సేవ ను సద్వినియోగం చేసుకొని , ఫౌండేషన్ కార్యకర్తలను అబినందించారు. మజ్జిగ అయిపోయినప్పుడు , చల్లని నీరు అందించటం జరిగింది. ఈ కార్యక్రమములో, రహమత్,సాయి,చంద్రశేఖర్,ఇస్తారు,చిన్నా,తదితరులు పాల్గొన్నారు.Tuesday, April 5, 2016
మధుమేహం -(ఈనాడు)05.04.2016) నుండి సేకరణ
అపోహలను ఛేదించండి!

Subscribe to:
Posts (Atom)