Wednesday, April 20, 2016

బెంగుళూరు ` మైసూరు పర్యటన ` నా అనుభవాలు (చివరి భాగము)

బెంగుళూరు ` మైసూరు పర్యటన ` నా అనుభవాలు (చివరి భాగము)

 తర్వాత రోజు(15.04.2016) శుక్రవారము,శ్రీరామనవమి కూడా అయినది. ఉదయం 6.30ని॥కు ఇన్నోవా(ఎ.సి) కారులో మైసూరు పర్యటనకు బయుదేరాము. ముందుగా శ్రీరంగపట్నం లోని రంగనాథస్వామి ని,అమ్మవారిని దర్శించుకున్నాము. స్వామి విగ్రహం చూస్తే మనకు ఒక రకమైనా  తన్మయత్వం గా ఉంటుంది.
  ఆ తదనతరం` మైసూర్‌ చేరాము. టిప్పుసుల్తాన్‌ సమాధి,టిప్పుసూల్తాన్‌` ఆంగ్లేయులను బంధించిన కారాగారము (వాటర్‌జైలు) చూసాము. వాటర్‌ జైలు గురించి కొంత వివరిస్తాను. అక్కడి సెక్యురిటీ గార్డు హిందీ లో చెప్పిన వివరము బట్టి` టిప్పుసుల్తాన్‌ కేవలము ఆంగ్లేయ అధికారులను మాత్రమే చంపేవాడు. సాధారణ సైనికులను మాత్రమే ఈ వాటర్‌ జైలు లో శిక్షించేవాడు. వారిని దీర్ఘ  చతురు సాకారము చీకటి గదిలో , చేతులు కట్టివేసి,మెడవరకు నీటిలో వారిని ఉంచేవాడు, ప్రతి 24గం॥ కు ఒకసారి ఆ నీరు ను తీసివేసి,వారికి ఆహారము అందజేసి,తిరిగి నీటిలో బంధించేవాడు. పక్రన్న ఉన్న కావేరినది నుండి నీటిని గురుత్వాకర్షణ పద్ధతి ద్వారా నీరుని వాటర్‌ జైలుకు తీసికువచ్చేవారు. కాని, ఇప్పుడు చూస్తే కావేరి నది , అక్కడ ఒక చిన్న పాయలా మాత్రమే ఉంది.
        అక్కడనుండి` మైసూరు ప్యాలస్‌ కు వెళ్ళాము. ప్రవేశరుసుము చెల్లించిన తర్వాత, లోపలికి ప్రవేశించాము. సాలార్‌జంగ్‌ మ్యూజియం లాగానే ఇదికూడా ఉంది. అనాటి మైసూరు రాజులువాడిన దుస్తులు,వారికొచ్చిన బహుమానాలు, వారి కుటుంబీకుల చిత్రపటాలు, అప్పటి వారిసైన్యం విశేషాలు, వారి అంత: పురము,ఉత్సవాలు జరిగేటప్పుడు రాజుగారు, వారి కుటుంబీకులు,అతిధిలు,ఇతర ప్రజలు కూర్చొనే ప్రదేశము చూశాము. ఆరోజుల్లో ఉన్న చెక్కను అందంగా చెక్కిన తీరు, ఫాల్స్‌ సీలింగ్‌ గా అమర్చిన విధానం చూసితీరవలసినదే ! ఇక్కడ మనము కొంత డబ్బు చెల్లిస్తే, ఆడియో సిస్టం ద్వారా మనకు హెడ్‌ ఫోన్‌ తో ప్రతి వస్తువు దగ్గర వారు ఏర్పాటుచేసిన నెంబరు తెలిపితే , ఆ వస్తువు వివిరాలు చెబుతారట. అన్ని ప్రభుత్వసెలవుదినాలో, ఇక్కడి ప్యాలస్‌ కు ఉన్న 1008లైట్లను సాయంత్రం 7గం॥ నుండి 7.30గం॥వరకు వెలిగిస్తారుట. అప్పుడు ,ప్యాలస్‌ చూస్తే ఇంకాబాగుంటుందిట. ప్యాలస్‌ చూట్టూ పురాతన దేవాలయము,రాజవంశీకులు మాత్రమే వచ్చే  గేట్లు, పనివారు వచ్చేగేట్లు ఇలా రకరకాల ద్వారాలు ఉన్నాయి.
                        ఇక ఇక్కడి  నుండి బృందావన్‌ గార్డ్‌న్‌ కు చేరాము.
    బృందావన్‌ గార్డ్‌న్‌ నుండి కేరళ రాష్ట్రం కేవలం 70కి॥మి. దూరమట. ఆరోజు ,మాకు ఎక్కువగా మళయాళీయులు కనిపించారు. ఈ గార్డెన్‌ అంత గొప్పగా ఏమీలేదు. పాత సినిమాలో ఇక్కడి పూల అందాలు చూపించటంతో మనకు కొత్తగా అనిపించదు. వాటర్‌ఫౌంటెన్‌,విద్యుత్‌ దీపాలమవెలుగులో కొత్త అందం వచ్చినట్లుగా ఉంటుంది. సాయత్రం 7.30గం॥ నుండి 8.00గం॥ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఉంటుందిట. సమయం లేక పోవటంతో చూడలేకపోయాం.
                అక్కడినుండి బయుదేరి రాత్రి11గం॥కు బెంగుళూరులోని మేము బసచేసిన హోటల్‌ కు చేరాము.
                                        IIIIIIIIIIIIIIIIII
        తర్వాత రోజు ది.16.04.2016(శనివారము),మా బంధువు ఇంట్లో బసచేసి,మధ్యాహ్ననం 4గం॥కు యెలహంక రైల్వేస్టేషన్‌ నుండి కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌ లో ది.17.04.2016 ఉదయం5.30గం॥హై దరాబాద్‌ చేరాము.
                   తిరుగు ప్రయాణంలో, ఒక సంఘటన: మా బృందంలో 11సం॥ మా తమ్ముడి కూతురుకి వేడికి, లేదా ప్రయాణ అలసట వ్డుల్ల కడుపులో ఇబ్బందిగాను ఉండి,శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది.  ఈ బాధ రాత్రి 7.30గం॥  మొదలు అయితే,మేము ఎక్ట్రోల్‌ పౌడరు,మా దగ్గర మాత్రలు వేసినా ఫలితం లేక పోయింది. దాంతో, రైల్వే వారి ఎమర్జెన్సీనెంబర్138 కు డయల్‌ చేస్తే ,మీ ట్రయిన్‌ టి.సి కి చెప్పమన్నారు. ఆయన సెల్‌ నెంబరు చెప్పమంటే మాకు తెలియదని సమాధానం చెప్పారు. మొత్తానికి ఎలాగో,ఆ టి.సి పట్టుకుని విషయం చెబితే, ఆయన వెంటనే,సంబంధిత అధికారికి ఫోన్‌ చేసి,తర్వాత స్టేషన్‌ అయిన డోన్‌ లో మీకు వైద్యసహాయం అందుతుందని తెలిపారు. డోన్‌ వస్తే, అక్కడ డాక్టర్‌ లేడు.అప్పటికి రాత్రి11.30గం॥ ,అడిగితే ఎవ్వరూ అందుబాటులో లేరని, మరి ఎక్కువగా ఉంటే తర్వాత స్టేషన్‌ అయిన కర్నూలులో దిగిపోండని,అక్కడి ఆర్‌.పి.ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉచిత సలహ. టి.సిని  అడిగితే, తన సంబంధిత అధికారి పలుమార్లు పి.ఎన్‌.ఆర్‌. నెంబరు అడగటమేగాని,అంతకు మించి స్పందన కన్పించటంలేదని వాపోయాడు. ఎట్టకేలకు,ఒక లేడీ డాక్టర్‌ వచ్చి ,ఏవో మందులిచ్చి, రూ॥100/ చార్జ్‌ చేసివెళ్లింది. ఈ ఇబ్బందిలో మాకు పూర్తిగా అండగా ఉంది,టి.సి విక్రమన్‌
ఎంతో ఓపిగా ఈ రచన చదివిన మీ అందరాకు నా ధన్యవాదాలు. మీ విలువైన కామెంట్స్ పెట్టగలరు.




















No comments:

Post a Comment