ది. 08.04.2016(శుక్రవారము) ఉదయం 11గంటలకు, ఇబ్రహింపట్నం
రింగ్ సెంటర్ లో దుర్ముఖి నామ సంవత్సరం
సందర్భముగా,ఉగాది
పచ్చడి మరియు చల్లని
మజ్జిగ ను ఆశయస్పూర్తి
ఫౌండేషన్ ఆధ్వర్యము లో పంపిణి చేసారు. Sub-inspector of Police
,ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ ,శ్రీనివాస్ గారు ,వచ్చి ఈ కార్యక్రమము ను
ప్రారంభించారు. మందు వేసవి లో చల్లని మజ్జిగ ను పంపిణి చేయటం ద్వారా చాలా
మంచి చేస్తున్నారని ఫౌండేషన్ కార్యకర్తలను అభినందిస్తు ,భవిషత్తులో మరిన్ని మంచి
కార్యక్రమాలు చేయాలనీ కోరారు.
ఎంతో మంది వాహన చోదకులు, ప్రయాణికులు, ఈ సేవ ను సద్వినియోగం చేసుకొని , ఫౌండేషన్ కార్యకర్తలను అబినందించారు. మజ్జిగ అయిపోయినప్పుడు , చల్లని నీరు అందించటం జరిగింది. ఈ కార్యక్రమములో, రహమత్,సాయి,చంద్రశేఖర్,ఇస్తారు,చిన్నా,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment