Monday, April 18, 2016

బెంగుళూరు - మైసూరు పర్యటన - నా అనుభవాలు

                బెంగుళూరు -  మైసూరు పర్యటన - నా అనుభవాలు


ది.13.04.2016 , బుధవారము, రాత్రి 9గం॥ కు ,ట్రయిన్‌ నెం 17603  కాచీగూడ` యశ్వంత్‌ పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ లో,మా కుటుంబము మరియు మా తమ్ముడి కుటుంబము (మొత్తం 8 మంది),కలిసి బెంగుళూరు - మైసూరు పర్యటనకు బయలుదేరాము.
     బెంగుళూరు లో యశ్వంతపూర్‌ స్టేషన్‌ దగ్గర దిగేసరికి ది.14.04.2016,గురువారము ఉదయం 10.30గం॥ అయినది. మండుటెండలో, నాన్‌` ఎ.సి కారులో బెంగుళూరు లోని మోడ్రన్‌ హోటల్‌ లో ,రెండు నాన్‌` ఎ.సి రూములో బస చేశాము. ప్రయాణబడలికతో మాకు దొరికిన ఆ హోటల్‌ లో ఎ.సి రూము లేవన్నా దిగిపోయాము.
     స్నానపానాదులు,భోజనాలు తర్వాత మధ్నాహ్నం 3గం॥ కు బయలు దేరి కారులో విధానసభ(రోడ్డుపైనుండి చూడటమే),తర్వాత లాల్‌బాగ్‌ (బొటానికల్‌ గార్డెన్‌) కు వెళ్ళాము. హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ లో కనిపించే కొన్ని రకాల దృశ్యాలే ఇక్కడా కనిపిస్తాయి ! వెరసి, నా అనుభూతి ప్రకారం అయితే,  హైదరాబాద్‌ లోని పబ్లిక్‌గార్డెన్‌ కంటే గొప్పగా ఏమీలేదు.
      తర్వాత, ఇక్కడి నుండి ఇస్కాన్‌ టెంపుల్‌ కు వెళ్ళాము. చాలా పెద్ద శ్రీకృష్ణ దేవాలయము. విదేశాలనుండి భక్తు లుపంపే విరాళాలతో నడుస్తున్నదని వినికిడి.ఇక్కడి ప్రతి ఒక్కటి పద్దతిగా ఏర్పాటు చేశారు, పాదరక్షలు భద్రపరిచే ప్రదేశములో ఏర్పాట్లు(ఇక్కడి డబ్బు చెల్లించాలి),వాహనప్రవేశము,చల్లని  మంచినీరు అందించే ఏర్పాటు,పూజావస్తువులు,భక్తిపుస్తకాలు,సి.డిలు , ఉచిత ప్రసాద వితరణ,సాయత్రం వేళ ‘హరేరామ,హరే కృష్ణ’ నామ సంకీర్తన అన్నీ బాగున్నాయి.
     ఇహ ఇక్కడనుండి,‘ ఒరియానొ(ORION) ’ అనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ కు వెళ్ళాం. ఇక్కడి దుకాణాలు, వాటి ధరలు అవే కొనేవారిని చూస్తే నాకైతే ఇండియాలోనే ఉన్నామా, అనిపించింది. ఇక్కడ చీర కట్లుకున్న ఆడవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. పెద్ద,చిన్న అని లేదు ` అందరు చుడీదార్లు,స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లు,షార్టులు .......... ఈ మాల్‌ లోనే బార్‌ కూడా ఉంది. అదేదో ప్యామిలీ రెస్టారెంటు లాగా, ఆడ,మగ కలిసి తాగటం,నాకు మాత్రం వింతగానే ఉంది. ఆ ప్రక్కనే స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. చల్లగాలికి   అక్కడ కూర్చొందామని వెళ్ళాం. కానీ, అది కూడా ఆ గేట్‌డ్‌ కమ్యూనిటీ లో ఉన్నఅపార్టుమెంట్‌ వారికి మాత్రమే అని అక్కడి సెక్యురిటీ సిబ్బంది , మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అక్కడినుండి, మేము బసచేసిన హోటల్‌ కు తిరిగి  చేరాము. ఈ బెంగుళూరు నగర పర్యటన లోమాకు  ఎంతో సహకరించిన నా మేనకోడలు శ్వేత,ఆమె భర్త కృష్ణ కు ధన్యవాదములు
                                       (రేపు  మైసూర్‌ పర్యటన విశేషాలు)










No comments:

Post a Comment