Saturday, October 24, 2015

Bible Words

మిత్రులారా ! మత గ్రంధములు అన్నీ మనిషి బాగు కోరి ,మంచి సందేశాన్ని ఇస్తున్నాయి . మనం, అర్థం చేసుకుని ఆచరించాలి . అంతే !  ఈ ఆదివారము (25.10.2015) నుండి, ప్రతి ఆదివారము  కొన్ని బైబిల్ వాక్యాలను మీకు అందిస్తునాను. ఈ వారము మనకు ఈ  బైబిల్ వాక్యాలను అందిస్తున్నవారు బడుగు పటేల్ గారు  ,పాస్టర్, ఇబ్రహీంపట్నం. 

మత్తయి 5 వ అధ్యాయము (5 : 3-11)
కొత్త 10 ఆజ్ఞలు 
ఆయన ఆ జనసమూహము లను చూచి కొండఎక్కి కూర్చుండగా  ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన  నోరు తెరచి ఈలాగు భోదింప సాగేను_ 
1.   ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు ; పరలోక రాజ్యము వారిది.
2.   దుఖపడు వారు ధన్యులు ; వారు ఓదార్చ బడుదురు. 
3.   సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించికొందురు. 
4.   నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు  ధన్యులు ; వారు తృప్తిపరచబడుదురు. 
5.   కనికరముగలవారు  ధన్యులు; వారు కనికరము పొందుదురు. 
6   హృదయ శృద్ది కలవారు ధన్యులు ; వారు దేవుని చూచెదరు . 
7.  సమాధానపరుచువారు  ధన్యులు ; వారు దేవును కుమారులన బడుదురు. 
8.  నీతి నిమిత్తము హింసిపబడువారు ధన్యులు ; పరలోక రాజ్యము వారిది 
9.  నా  నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, హింసించి  మీమీద అబద్దముగా చెడ్డ మాటలెల్ల                   పలుకునపుడు  మీరు ధన్యులు। 
10.  సంతోషించి ఆనందపరుచుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును . ఈ లాగున వారు మీకు పూర్వ        ముందుండిన ప్రవక్త లను హించించిరి.    

No comments:

Post a Comment