Thursday, January 7, 2016

అమెరికా చదువులు

         అమెరికా చదువులు
గత కొద్ది కాలముగా, తెలుగు విద్యార్డులెందరో  అమెరికాకు ఉన్నత చదువుల నిమిత్తము వెళ్ళటం ,అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులతో ముఖాముఖి తలపడ లేక ,తిరిగి ఇండియా కు రావటం పరిపాటి గా మారింది .
అమెరికా లోని రెండు ప్రముఖ యూనివర్సిటీ ల పేర్లు చెబుతూ , అవి బ్లాక్ లిస్టు లో ఉన్నవని పుకార్లు పుట్టించటం , అమెరికాకు ఎందునిమిత్తం వచ్చారన్న ప్రశ్నకు బాంబులేయటానికి వస్తామా అని, మనవిద్యార్డులు,  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో వేళాకోళం గా మాట్లాడడటం, అసలు అమెరికా ప్రభుత్వ మే ఇలా రెచ్చ గొట్టటం చేస్తున్నదా ? ఇవ్వన్ని గమనిస్తూ భారత ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరించటం చూస్తుంటే - సామాన్యుడుకి ఇది  ఒక అర్థం గాని  విషయం గా  మారింది !
సాధారణముగా ,అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టు లో వున్న విశ్వవిద్యాలయముల జాబితా ని ఆయా దేశాలలోని తమ రాయబార కార్యాలయములకు పంపుతుంది. లేదా సంబందిత వెబ్ సైట్లను గమనించినా విషయం తెలుస్తుంది . అక్కడి విశ్వవిద్యాలయములలో చదవాలుకొనే విద్యార్థులు అక్కడి పరిస్తితులు గురించి , వారితో వ్యవహరించవలసిన విధానాల ఫై సరయిన విధానము తెల్సుకోకపోవటం ప్రధాన లోపముగా కనిపిస్తోంది. ముఖ్యముగా, అమెరికన్ లు మాట్లాడే ఇంగ్లిష్ ఏస ను అర్థం చేసుకోలేక పోవటం, ఈ విషయం లో తగు సాధన చేయక పోవటం , ఎడ్యుకేషన్ కన్సులంట్ల  మీద పూర్తి భారం వేసి కూర్చోవటం, కూడా ఒక లోపం గ వున్నది.
        అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ,మీరు ఇక్కడ విద్యాభ్యాసమునకు , ఆర్ధిక వనరులు గురించి అడిగినప్పుడు, పార్ట్ టైం జాబు చేసి సంపాదిస్తూ చదువుకుంటామని, నిషేధిత సమాధానములు చెప్పడటం చూస్తుంటే సరియిన అవగాహన లేకుండగానే,అమెరికాకు పయనమయ్యారని తెలుస్తోంది .
మొదట వెళ్ళిన వారు ఫై విధముగా సమాధానాలు చెప్పటం తో, అప్రమత్తమయ్యిన  అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తరువాత వచ్చే వారి విషయములో ఖటినముగా వ్యవహరించి, వారు ఏమి చెబుతున్నారో వినే ఓపిక కూడా లేకుండా విపరీత అసహనముతో మన వారిని 12 నుండి 24 గంటల పాటు నిర్బంధించి (ఏదో ఖైదులులాగ ),చిత్రహింసలకు గురి చేసి ,మానసిక క్షోభ కు గురిచేశారు.
 ఈ సందర్భముగా ,మన విద్యార్థులు తెలుస్కోవాల్సిన విషయం ఒకటున్నది, అది ఏమంటే , మీ ఫేస్బుక్ ఎకౌంటు లో మీరు పోస్ట్ లేదా చాంటింగ్ చేస్తున్న, మరియు షేర్ చేస్తున్న విషయాలను బట్టి మిమ్ములను అంచనా  వేయటం జరుగుతోంది. ఇది మీ భవిష్యత్తు ఫై ప్రభావం చూపే పరిస్తితి నేడు ఉన్నది.
ఇదిలా ఉంటే, అమెరికా లోని మన తెలుగు సంఘాలు మీకు ఏ కష్టమొచ్చినా చెప్పండి , మేమున్నాం అంటూ నెమ్మదిగ స్పందించాయి. అయినా, మీరు సరియిన అవగాహన లేకుండా అమెరికా లో చదువులకు రావటం ఏమిటి అన్నట్లు ఉన్నాయి వీరి మాటలు. ఇన్ని కబుర్లు చెప్పే వీరు- ఇక్కడి విద్యార్థులకు  ఈ విషయాల ఫై అవగాహన శిబిరాలను నిర్వహించవచ్చు కదా !
        ఇప్పడు భారత ప్రభుత్వ వైఖరి చూద్దాము – తెలుగు వాడు అనే టప్పటికి కేంద్రముకు కూడా లోకువ లా ఉంది. ఈ పరిస్తితుల ఫై అమెరికా ప్రభుత్వం తో మాట్లాడి , ఈ సమస్యకు చక్కని  దారి చూపి విద్యార్థుల భవిష్యత్తు కు మంచి బాట చూపవల్సినది   పోయి, నిమ్మకు నీరెత్తినట్లు   కూర్చుది.
వీటన్నిటికి కారణం, బట్టి చదువులు, గుమాస్తాలను తయారు చేసే మన విద్యా వ్యవస్థ , ఈ  వ్యవస్థ ను   బాగుచేసే పనికి నడుం కట్టకుండా అలసత్వం ప్రదర్శించే  మనము -  కాదంటారా !


 






Tuesday, January 5, 2016

ప్రభుత్వ ఆసుపత్రి లో పళ్ళు,దుస్తులు వితరణ

ది. 06.01.2016. బుధ వారము ఉదయము 12 గంటలకు పాత ప్రభుత్వ ఆసుపత్రి (విజయవాడ) లో మాతా శిశు విభాగం లో ఈ రోజు జన్మించిన శిశువులకు నూతన వస్త్రాలు, బిస్కట్ పాకెట్స్ లను దాదాపు 40 మంది కి  ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ , ఇబ్రహింపట్నం వారు పంచటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమునకు చక్కని సాయం అందించారు. ఈ కార్యక్రమములో జే.డి, రహమత్,చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Do you want a reliable and sincere spare car driver ?

NALLAMOTHU DURGA PRASAD, (J.D) Near Ibrahimpatnam Post office ,Zakir hussain collage road,Ibrahimpatnam-Krishana(D.T) Cell : 7799525143.

photo grapher


Friday, January 1, 2016

1104 యూనియన్ - నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఎలట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104 )  ప్రాతీయ శాఖ -- స్టానిక విద్యుత్ అధికారులను  కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం జరిగింది. చీఫ్ ఇంజనీర్ శ్రీ రావి ప్రభాకర రావు మాట్లాడుతూ సంవత్సరము  అందరమూ  కష్టించి ఇప్పుడు ప్లాంట్ కున్న పేరు నిలపాలని కోరారు .  తెలంగాణలో పనిచేస్తున్న మన ఆంధ్రా సోదర కార్మికుల పరిస్తితి కి చింతిస్తున్నాను అని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు రావల్సిస్ని పెరిగిన వేతనాలు- సంక్రాంతి కి అందేలా ప్రయతిస్తున్నాం అని తెలిపారు . కోల్ ప్లాంట్ ఎస్.ఇ శ్రీ రాములు మాటలాడు తూ పదవీ విరమణ పొందు తున్న కార్మికుల స్తానములో కొత్త వారని నియ మిచా లని అభిప్రాయ పడ్డారు.  సివిల్ ఎస్.ఇ సుబ్బారావు గారిని కలిసి నూతన నిర్మాన దశ లో కార్మికుల పిల్లలకు కాంట్రాక్టు లేబెర్ గా నియమిచుటకు ప్రాధాన్యత నివ్వల్లని కోరగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రముములో రీజనల్ ప్రెసిదెంట్ దాసు, సెక్రటరీ శ్రీనివాస్ , రమణయ్య, నాగేశ్వర రావు, పటేల్, ధన మూర్తి, కొండపల్లి అప్పా రావు, ప్రసాద్, సత్యనారయణ ,మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆశయ స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యము లో అన్నదానము

ది.01-01-2016 న  ఆశయ స్పూర్తి ఫౌండేషన్  ఆధ్వర్యము లో అన్నదానము కార్యక్రమము,,కొండపల్లి లో జరిగింది. నూతన సంవస్తరము సందర్భముగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రముములో అన్నము ,సాంబారు ,కూర కలిగిన అన్నము కలిపినా పాకెట్స్ ను కొండపల్లి లోని పలు మసీదుల వద్దనున్న పేదలకు పంచటం జరిగింది. ఈ కార్యక్రములో రహమత్, చందు,ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు.

ఫొటోస్