Saturday, November 21, 2015

కరాటే మురళి

కరాటే మురళి
న చిన్నతనములో తన తల్లి ని దూషించిన వాడిని, కొట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ని – ఆ చిన్నారి మనస్సు తట్టుకోలేక పోయింది,  ఆ బాధ వయస్సు తో పాటు పెరిగింది . ఇలాంటి పరిస్థితి ఇక ముందు సహించకూడదనుకున్న ఆ కుర్రాడు , పట్టుదలతో కరాటే లో బ్లాకు బెల్ట్ 4 th DON  స్థాయి కి ఎదిగాడు. అతడే కరాటే మురళి

            
కొండపల్లి లోని  టాలెంట్ హైస్కూల్, క్రాంతి, శాంతినికేతన్, ఆదర్స విద్యానికేతన్, కేతన్ కొండ లోని జానెట్ హైస్కూల్,కంకిపాడు లోని Oxford English Medium హైస్కూల్ విద్యార్థులకు కరాటే లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి స్కూల్ లోను సుమారు 30 నుండి  50 విద్యార్థులకు కరాటే లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

 తన శిక్షణ లో కేంద్రీయ విద్యాలయము , గుంటుపల్లి, విద్యార్ధి శ్రీచరణ్ తేజ , అద్దంకి లో జరిగిన ఇంటర్నేషనల్  కరాటే పోటీలో 4 వ ర్యాంక్ సాదించటం తనకు చాలా గర్వకారణం  ఉన్నదని తెలిపారు. ఈ పోటికి శ్రీలంక, నేపాల్ నుండి న్యాయ నిర్నేతలు వచ్చారని తెలిపారు.
 తనకు చదువు తక్కువైనా, ఉద్యోగం కోసం 3 సంవస్సరాలు  హైదరాబాద్ లో ఉద్యోగం కోసం తిరిగానని, కానీ ఎక్కడా ఉద్యోగం దొరక లేదని తెలిపారు. తిరిగి కొండపల్లి వచ్చి ప్రతి స్కూల్ కి వెళ్లి తనకు  కరాటే లో ఉన్న నైపుణ్యము గురించి  చెప్పి ఉద్యోగం అడిగి నప్పుడు ఎవరు స్పందించలేదనిలేదని , అప్పడు రాయల్ బ్రిలియంట్స్ అధినేత నిడుముక్కల శివశంకర రావు గారు మొదటి సారిగా తనకు అవకాశము ఇచ్చారని, అక్కడ 7 సంవత్సరాలు  చేసిన  తర్వాత టాలెంట్, ఆదర్శ విద్యానికేతన్ .....ఇలా మిగిలిన స్కూల్స్ లో చేయటం జరుగుతున్నది. వారానికి 2 క్లాసులు వుంటాయి అని తెలిపారు.
ఈ వృత్తిలో తనకు వచ్చే ఆదాయం, నెలకు  కేవలం రూ 10,000/(పదివేలు  ) మాత్రమే అయినా తను చేసే పని లో తృప్తి పొందుతున్నానని తెలిపారు.  కరాటే లో చాలా పెద్ద స్తాయి 10 don అని, అంతకంటే పెద్ద స్తాయి 10-4, 10-3, 10-2, 10-1 లు వున్నాయని, కానీ 10 don కావటమే చాల కష్టమని తెలిపారు.
కుంగ్ ఫూ,కరాటే లకు పెద్ద తేడా ఏమి లేదని, భంగిగిమల్లో తేడా మాత్రమే అని, అయితే, కరాటే కు ప్రపంచ వ్యాప్తముగా గా ప్రాచుర్యము  ఉన్నదని తెలిపారు.నేటి కాలములో విద్యార్ధులు, ముఖ్యముగా ఆడపిలల్లు , ఇలాంటి ఆత్మా రక్షణ కలిగించే కరాటే లాంటి విద్యలు నేర్సుకోవలనిన అవసరం ఎంతైనా ఉన్నది.
అయితే , ప్రభుత్వ పరముగా తనకు ఎటువంటి సపోర్ట్ లేదని ,  కనీసం దాతలు ఎవరినా సహకరిస్తే విద్యార్ధులను, విదేశాలలోలలో జరిగే పోటీలకు కూడా తయారు చేయగలనని  తెలిపారు.
ఈ విద్య నేర్చుకొనేవారు మాంసాహారులు అయి ఉండాలని ఏమీ లేదు, పప్పు , కాయగూరల్లో కూడా ఎన్నో విటమిన్లు పోషకాలు వున్నాయని తెలిపారు.
ప్రజలకు ,ప్రభుత్వమునకు తన విన్నవించేదేమంటే  ఈ విద్యను స్కూల్స్ లో  నిర్బంధ విద్యగా ప్రవేశ పెట్టాలని కోరుతున్నారు. వీరి అడ్రస్ :- P.Murali, C/o T.Lakshmi narayana. Qr. No G-117,B-Colony, V.T.P.S, Ibrahimpatnam, 521456, Cell No:8096446054, e-mail: murali.karate6054@gmail.com

 భవిష్యత్తులో , మురళి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.    




No comments:

Post a Comment