Friday, November 6, 2015

గాయకుడు,కళాకారుడు- కొండపల్లి అప్పారావు





అతని గీతం లో ఆవేదన....... ఆక్రోశం....ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండకట్టటం.....సామాజికసమస్యలు, రుగ్మతలు ఫై చైతన్య పరచటం, .....అన్ని కలిపితే  ...కొండపల్లి అప్పారావు పాట !
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో, రైల్వే సైడింగ్ విభాగము లో పని చేసే 50 ఏళ్ళ అప్పా రావు  తన పాటలతో ప్రజలని  చైతన్య పరుస్తూ , సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ సమాజం ఏమైపోతే నాకేంటి, అన్న ధోరణలో కాకుండా , సమాజానికి నేను ఏమి చేయగలను, అన్న ఆలోచనతో , చదివింది 5 వ తరగతే అయినా, చక్కని ఆత్మవిశ్వాసము తో తన పాటల ద్వారా సమాజాన్ని  చైతన్య పరుస్తున్నారు.
              అప్పారావు గారు,     ఆంద్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి , కృష్ణా జిల్లా అధ్యక్షడు గా 2014-15 నుంచి పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమము లో దాదాపు 10 పాటలతో , స్వీయ రచన,స్వరకల్పన చేసి ,ఆలపించారు. ఇటీవల , విద్యుత్ వినియోగం లో  LED బల్బులు ద్వారా పొదుపు ను  ఎలా తేవచ్చో, అందర్నీ ఆకట్టుకునేలా స్వీయ రచన,స్వరకల్పన  తో ఒక గేయాన్ని రచించి , ఆలపించగా , డాక్టర్ నార్ల తాతారావు  థర్మల్ విద్యుత్ కేంద్రం వారు ,జ్ఞాపిక తో సన్మానించారు.
        అలాగే, కిల్లీ,గుట్కా,ఖైనీ,పాన్ పరాగ్ ల సేవనము వల్ల కలిగే  అనారోగ్య సమస్యలు  ,సెల్ ఫోన్ వాడకము లో పరిమితి  మరియు జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ ,మొక్కల పెంపకం, వంటి అంశాల ఫై ప్రజల హృదయానికి తాకేలా పాడటం లో  అప్పారావు గారిది  ప్రత్యేక శైలి.
 వీరి పాటలలో కొన్ని స్వీయ రచన కాగా ,కొన్ని YOU TUBE  నుండి మిత్రుల సహకారముతో డౌన్లోడ్ చేసు కొని పాడేవి కొన్ని.
 ప్రజలు-  ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలూ,ప్రజాహితం కోరి పనిచేయాలని, అంతే గాని, ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెడుతుంటే ,ఈ విషయాల ఫై ప్రజలను వీధినాటకాల ద్వారా, పాటల ద్వారా , చైతన్య పరుస్తామని అందుకు ప్రజా నాట్య మండలి ఎంతో సహకారం ను అందిస్తున్నదని తెలిపారు.
 కళా మంజరి,నాగార్జున కళా పరిషత్, వి.టి.పి.ఎస్. కల్చర్ల్ అసోసియేషన్ వంటి సాంస్కృతిక సంస్థ లలో సభ్యులుగా ఉన్నవీరు ,నంది నాటకోత్సవాలు లో పాల్గొని బహుమతులు పొందారు.ఎగ్జిబిషన్ సొసైటి, విజయవాడ వారు,2014 సంవత్సరం లో  ఏర్పాటు చేసిన కృష్ణ జిల్లా కళాకారుల సన్మాన కార్యక్రమములో వీరు  సన్మానం పొందారు.
ఎంతో పుణ్యం చేసుకొంటెనో, ఈ జన్మ వచ్చింది , కనుక ఈ జన్మ సార్ధకమయ్యేలా ,సమాజానికి తన వంతు సేవ చేయాలనేది తన లక్ష్యమని తెలిపారు.
ప్రజలు, సాంస్కృతిక సంస్థలు తన సేవలును ఉచితముగా వినియోగించు కోవలసిందిగా అప్పారావు గారు కోరుతున్నారు. వారు పొందిన జ్ఞాపికలు కొన్నిటి ని ఈ క్రింద చూడవచ్చు. 
వీరి చిరునామా : కొండపల్లి అప్పారావు,డోర్ నెం: 33-32,శ్రీ నాగ సాయి నగర్, బైపాస్ రోడ్,కొండపల్లి, కృష్ణాజిల్లా-521228, Cell No : 9494848099. 









No comments:

Post a Comment