Wednesday, November 18, 2015

9 మరియు10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు.

ది. 18.11.2015, బుధవారం,  ఆశయ స్పూర్తి ఫౌండేషన్ , ఇబ్రహీంపట్నం వారిచే , ప్రభుత్వ స్కూల్స్ లో చదివే  9 మరియు10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు జరిగింది. ఉదయం 11గంటలు జెడ్.పి.హెచ్. స్కూల్ (బాలురు),కొండపల్లి , స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి Dy. E.O జార్జి రాజు గారు హాజరయ్యారు. మా రోజుల్లో ఏమి చదవాలో తెలియదు , తెలియక పంతుళ్ళమయ్యాము అంటూ చమత్కరించారు. భవిషత్తు బంగారు బాట కావాలంటే కెరీర్ ఫై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. incharge-headmastar వేదవతి ఈ కార్యక్రమ్మములో పాల్గొన్నారు
    అలాగే, మద్యాహ్నము 2.30 pm -జెడ్.పి.హెచ్. స్కూల్ (బాలికలు),కొండపల్లి , స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమము - లో  బాలికాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .
            ఫై కార్యక్రమాలు జరిగిన అనంతరము ,ఫౌండేషన్  సభ్యులు, కెరీర్ ఫై అవగాహన కలిగేలా  విద్యార్థులకు ఫ్లో చార్ట్ లు, స్కూల్ లైబ్రరి కి పుస్తకాలు బహుకరించారు.

 ఈ కార్యక్రమానికి, IMPACT FOUNDATION ,HYDERABAD వారి తరుపున ప్రముఖ వక్త సాయి సతీష్ హాజరయ్యి ,విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన కల్పించారు.
 ఆశయ స్పూర్తి ఫౌండేషన్  సభ్యులు రహమత్,  జె.డి , వెంకి  కమల్ తేజ, ఎస్తేర్ తదితరులు ఏంతో చక్కగా  ఈ కార్యక్రమాన్ని నిర్వహించి , భావి తరాలకు కెరీర్ ఫై అవగాహన కల్పనకు విశేష మైన కృషి చేసారు.



No comments:

Post a Comment