ది. 28.11.2015 న నేను విజయవాడ లో జ్యుయలరి దుకాణాలకు వెల్లి నప్పుడు, కొన్ని చోట్ల డెబిట్/క్రెడిట్ కార్డు లు ద్వారా లావాదేవికు ఒప్పుకోవటం లేదు. పోనీ , ఒప్పుకున్నా అది రూ|| 50,000/ కు మాత్రమే పరిమితము. దానిలో కూడా రూ ||30000/ ఫై బడిన కొనుగోలుకు పాన్ కార్డు గాని , డ్రైవింగ్ లైసెన్స్ గాని, వోటర్ కార్డు గాని proof of identity గా చూపాలి . లేక పోతే వీలు కాదు. కాబట్టి, మీరు దుకాణాలకు వెళ్ళేటప్పుడు , ఒకటికి, రెండు కార్డ్లు తీసి కెల్లటం మంచిది.
A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Sunday, November 29, 2015
Saturday, November 28, 2015
Friday, November 27, 2015
Thursday, November 26, 2015
Tuesday, November 24, 2015
Monday, November 23, 2015
Sunday, November 22, 2015
Saturday, November 21, 2015
కరాటే మురళి
కరాటే మురళి
తన చిన్నతనములో తన తల్లి ని దూషించిన వాడిని, కొట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ని – ఆ చిన్నారి మనస్సు తట్టుకోలేక పోయింది, ఆ బాధ వయస్సు తో పాటు పెరిగింది . ఇలాంటి పరిస్థితి ఇక ముందు సహించకూడదనుకున్న ఆ కుర్రాడు , పట్టుదలతో కరాటే లో బ్లాకు బెల్ట్ 4 th DON స్థాయి కి ఎదిగాడు. అతడే కరాటే మురళి
కొండపల్లి లోని
టాలెంట్ హైస్కూల్, క్రాంతి, శాంతినికేతన్, ఆదర్స విద్యానికేతన్, కేతన్ కొండ
లోని జానెట్ హైస్కూల్,కంకిపాడు లోని Oxford English Medium హైస్కూల్ విద్యార్థులకు
కరాటే లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి స్కూల్ లోను సుమారు 30 నుండి 50 విద్యార్థులకు కరాటే లో శిక్షణ ఇస్తున్నట్లు
చెప్పారు.
తన శిక్షణ
లో కేంద్రీయ విద్యాలయము , గుంటుపల్లి, విద్యార్ధి శ్రీచరణ్ తేజ , అద్దంకి లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలో 4 వ ర్యాంక్ సాదించటం తనకు చాలా
గర్వకారణం ఉన్నదని తెలిపారు. ఈ పోటికి
శ్రీలంక, నేపాల్ నుండి న్యాయ నిర్నేతలు వచ్చారని తెలిపారు.
తనకు
చదువు తక్కువైనా, ఉద్యోగం కోసం 3 సంవస్సరాలు హైదరాబాద్ లో ఉద్యోగం కోసం తిరిగానని,
కానీ ఎక్కడా ఉద్యోగం దొరక లేదని తెలిపారు. తిరిగి కొండపల్లి వచ్చి ప్రతి స్కూల్ కి
వెళ్లి తనకు కరాటే లో ఉన్న నైపుణ్యము
గురించి చెప్పి ఉద్యోగం అడిగి నప్పుడు
ఎవరు స్పందించలేదనిలేదని , అప్పడు రాయల్ బ్రిలియంట్స్ అధినేత నిడుముక్కల శివశంకర
రావు గారు మొదటి సారిగా తనకు అవకాశము ఇచ్చారని, అక్కడ 7 సంవత్సరాలు చేసిన
తర్వాత టాలెంట్, ఆదర్శ విద్యానికేతన్ .....ఇలా మిగిలిన స్కూల్స్ లో చేయటం
జరుగుతున్నది. వారానికి 2 క్లాసులు వుంటాయి అని తెలిపారు.
ఈ వృత్తిలో తనకు వచ్చే ఆదాయం, నెలకు కేవలం రూ 10,000/(పదివేలు ) మాత్రమే అయినా తను చేసే పని లో తృప్తి
పొందుతున్నానని తెలిపారు. కరాటే లో చాలా
పెద్ద స్తాయి 10 don
అని, అంతకంటే పెద్ద స్తాయి 10-4, 10-3,
10-2, 10-1 లు వున్నాయని, కానీ 10
don కావటమే చాల కష్టమని తెలిపారు.
కుంగ్ ఫూ,కరాటే లకు
పెద్ద తేడా ఏమి లేదని, భంగిగిమల్లో తేడా మాత్రమే అని, అయితే, కరాటే కు ప్రపంచ
వ్యాప్తముగా గా ప్రాచుర్యము ఉన్నదని
తెలిపారు.నేటి కాలములో విద్యార్ధులు, ముఖ్యముగా ఆడపిలల్లు , ఇలాంటి ఆత్మా రక్షణ
కలిగించే కరాటే లాంటి విద్యలు నేర్సుకోవలనిన అవసరం ఎంతైనా ఉన్నది.
అయితే , ప్రభుత్వ పరముగా
తనకు ఎటువంటి సపోర్ట్ లేదని , కనీసం దాతలు ఎవరినా సహకరిస్తే విద్యార్ధులను, విదేశాలలోలలో
జరిగే పోటీలకు కూడా తయారు చేయగలనని తెలిపారు.
ఈ విద్య నేర్చుకొనేవారు
మాంసాహారులు అయి ఉండాలని ఏమీ లేదు, పప్పు , కాయగూరల్లో కూడా ఎన్నో విటమిన్లు పోషకాలు
వున్నాయని తెలిపారు.
ప్రజలకు ,ప్రభుత్వమునకు
తన విన్నవించేదేమంటే ఈ విద్యను స్కూల్స్
లో నిర్బంధ విద్యగా ప్రవేశ పెట్టాలని
కోరుతున్నారు. వీరి అడ్రస్ :- P.Murali, C/o T.Lakshmi narayana. Qr. No G-117,B-Colony, V.T.P.S, Ibrahimpatnam, 521456, Cell No:8096446054, e-mail: murali.karate6054@gmail.com
Friday, November 20, 2015
Wednesday, November 18, 2015
9 మరియు10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు.
ది. 18.11.2015, బుధవారం, ఆశయ స్పూర్తి ఫౌండేషన్ , ఇబ్రహీంపట్నం వారిచే , ప్రభుత్వ స్కూల్స్ లో చదివే 9 మరియు10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు జరిగింది. ఉదయం 11గంటలు జెడ్.పి.హెచ్. స్కూల్ (బాలురు),కొండపల్లి , స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి Dy. E.O జార్జి రాజు గారు హాజరయ్యారు. మా రోజుల్లో ఏమి చదవాలో తెలియదు , తెలియక పంతుళ్ళమయ్యాము అంటూ చమత్కరించారు. భవిషత్తు బంగారు బాట కావాలంటే కెరీర్ ఫై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. incharge-headmastar వేదవతి ఈ కార్యక్రమ్మములో పాల్గొన్నారు
అలాగే, మద్యాహ్నము 2.30 pm -జెడ్.పి.హెచ్. స్కూల్ (బాలికలు),కొండపల్లి , స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమము - లో బాలికాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .
ఫై కార్యక్రమాలు జరిగిన అనంతరము ,ఫౌండేషన్ సభ్యులు, కెరీర్ ఫై అవగాహన కలిగేలా విద్యార్థులకు ఫ్లో చార్ట్ లు, స్కూల్ లైబ్రరి కి పుస్తకాలు బహుకరించారు.
ఈ కార్యక్రమానికి, IMPACT FOUNDATION ,HYDERABAD వారి తరుపున ప్రముఖ వక్త సాయి సతీష్ హాజరయ్యి ,విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన కల్పించారు.
ఆశయ స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు రహమత్, జె.డి , వెంకి కమల్ తేజ, ఎస్తేర్ తదితరులు ఏంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి , భావి తరాలకు కెరీర్ ఫై అవగాహన కల్పనకు విశేష మైన కృషి చేసారు.
అలాగే, మద్యాహ్నము 2.30 pm -జెడ్.పి.హెచ్. స్కూల్ (బాలికలు),కొండపల్లి , స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమము - లో బాలికాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .
ఫై కార్యక్రమాలు జరిగిన అనంతరము ,ఫౌండేషన్ సభ్యులు, కెరీర్ ఫై అవగాహన కలిగేలా విద్యార్థులకు ఫ్లో చార్ట్ లు, స్కూల్ లైబ్రరి కి పుస్తకాలు బహుకరించారు.
ఈ కార్యక్రమానికి, IMPACT FOUNDATION ,HYDERABAD వారి తరుపున ప్రముఖ వక్త సాయి సతీష్ హాజరయ్యి ,విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన కల్పించారు.
ఆశయ స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు రహమత్, జె.డి , వెంకి కమల్ తేజ, ఎస్తేర్ తదితరులు ఏంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి , భావి తరాలకు కెరీర్ ఫై అవగాహన కల్పనకు విశేష మైన కృషి చేసారు.
Monday, November 16, 2015
Sunday, November 15, 2015
9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు
9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు ను ఆశయస్పూర్తి ఫౌండేషన్, ఇబ్రహీంపట్నం వారు నవంబర్ 18 వ తారిఖు న ఇబ్రహీంపట్నం, మరియు కొండపల్లి హై స్కూల్ విద్యార్థులకు, ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు తిరిగి సాయత్రం 2.౦౦ గంటల నుండి 4.30 గంటల వరకు ఏర్పాటు చేసారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సాయి సతీష్ ,హైదరాబాద్ వారు విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన ను కలిస్తారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆశయస్పూర్తి ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యులు కోరుచున్నారు.
Sunday, November 8, 2015
ఆశయస్ఫూర్తి ఫౌండేషన్- కార్యనిర్వాహక సమావేశం
ది, 08.11.2015, ఆదివారం ఉదయం 11గం// లకు ఆశయస్ఫూర్తి ఫౌండేషన్, ఏ -కాలని -ఇబ్రహీంపట్నం, వారి కార్యనిర్వాహక సమావేశం జరిగింది . 10 వ తరగతి చదివిన తరువాత, ఏయే కోర్స్సులు చదివితే , ఉపాధి అవకాశాలు బాగుంటాయి, కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మన సామర్థము బట్టి కోర్స్సుల ఎంపిక ఎలా చేసుకోవాలి లాంటి విషయలఫై నవంబర్ లేదా డిసెంబర్ 2015, లలో ప్రభుత్వ స్కూల్ లలో 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు అనుభవజ్ఞు లైన నిపుల్ల్లైన వారిచే అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయ్యన్నుట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత అధికారుల నుండి అనుమతి రాగానే తేది తెలుపుతా మని తెలిపారు.
Saturday, November 7, 2015
STATE BANK OF INDIA -( ONE OF THE BEST ) HOME LOAN SALES TEAM, VIJAYAWADA
HOME LOAN SALES TEAM
VIJAYAWADA
SIVARAMAKRISHANA - 9704775522
D. APPA RAO - 7032642273
CAR LOAN
K.RAJA RAO - 7032642275
On of the best doctor in Kondapalli
Dr.MOHANA RAO MEMORIAL SUPER SPECIALITY HOSPITAL
(Surgical Specialty Hospital)
Main Road, Kondapalli, Krishna(d.t)
Ph No : 0866-2872860
Endoscopist & Laaparoscopic Surgeon
Dr.MAMIDI SEETARAMA RAO,
M.B.B.S. D.N.B (SURGERY)(NEW DELHI)
Regd No 12618
* Gastoscopy * Laparoscopy* E.C.G * Micro Surgery* Clinicla Laboratory * X-Ray
24 Hours Emgergecy Services.
(Surgical Specialty Hospital)
Main Road, Kondapalli, Krishna(d.t)
Ph No : 0866-2872860
Endoscopist & Laaparoscopic Surgeon
Dr.MAMIDI SEETARAMA RAO,
M.B.B.S. D.N.B (SURGERY)(NEW DELHI)
Regd No 12618
* Gastoscopy * Laparoscopy* E.C.G * Micro Surgery* Clinicla Laboratory * X-Ray
24 Hours Emgergecy Services.
Bible words
పాస్టర్ చెప్పే మాట : ధనవంతులై ఉండుట తప్పు కాదు ,ధనవంతులైన వారు తమ జీవిత కాలములో తమకు ఇష్ట మై నట్లు సుఖము అనుభవించటం అనగా ధనవంతులు తమ బ్రతుకులో తిండి,బట్ట,సుఖము,మాత్రమే తలచుచున్నారు . వాటిని అనుగ్రహించిన దేవునికి ఇష్ట మైనట్లు జీవించాలని గుర్తించరు . ఇలాంటి వారు మరణించిన తరువాత పటాల మందు మండే గుండా లల్లో పాలు పొంది బాధపడుచు, ఈ యాతన మా వారు అనగా నా భార్య, నా పిల్లలు ,నా సోదర సోదరీ మణులు పొందవలదని పటాలములో ప్రా ర్ది యిన్చు చున్నారు . కానీ, భూమి మీద భోధకుల మాట విని , దేవునుకి ఇస్తమైనట్టు జీవించు వారు యాతన కర మైన స్థలము తప్పించుకొని నెమ్మది కరమైన పరలోకమందు యుగయుగములు ఆనందముగా జీవించెదరు .
మరిన్ని వివరములకు -సంప్రదించండి -
బడుగు పటేల్ ,పాస్టర్, సెల్ : 9849386419.
మరిన్ని వివరములకు -సంప్రదించండి -
బడుగు పటేల్ ,పాస్టర్, సెల్ : 9849386419.
Friday, November 6, 2015
గాయకుడు,కళాకారుడు- కొండపల్లి అప్పారావు
అతని గీతం లో ఆవేదన....... ఆక్రోశం....ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండకట్టటం.....సామాజికసమస్యలు, రుగ్మతలు ఫై చైతన్య పరచటం, .....అన్ని కలిపితే ...కొండపల్లి అప్పారావు పాట !
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో, రైల్వే సైడింగ్ విభాగము లో పని చేసే 50 ఏళ్ళ అప్పా రావు తన పాటలతో ప్రజలని చైతన్య పరుస్తూ , సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ సమాజం ఏమైపోతే నాకేంటి, అన్న ధోరణలో కాకుండా , సమాజానికి నేను ఏమి చేయగలను, అన్న ఆలోచనతో , చదివింది 5 వ తరగతే అయినా, చక్కని ఆత్మవిశ్వాసము తో తన పాటల ద్వారా సమాజాన్ని చైతన్య పరుస్తున్నారు.
అప్పారావు గారు, ఆంద్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి , కృష్ణా జిల్లా అధ్యక్షడు గా 2014-15 నుంచి పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమము లో దాదాపు 10 పాటలతో , స్వీయ రచన,స్వరకల్పన చేసి ,ఆలపించారు. ఇటీవల , విద్యుత్ వినియోగం లో LED బల్బులు ద్వారా పొదుపు ను ఎలా తేవచ్చో, అందర్నీ ఆకట్టుకునేలా స్వీయ రచన,స్వరకల్పన తో ఒక గేయాన్ని రచించి , ఆలపించగా , డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం వారు ,జ్ఞాపిక తో సన్మానించారు.
అలాగే, కిల్లీ,గుట్కా,ఖైనీ,పాన్ పరాగ్ ల సేవనము వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ,సెల్ ఫోన్ వాడకము లో పరిమితి మరియు జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ ,మొక్కల పెంపకం, వంటి అంశాల ఫై ప్రజల హృదయానికి తాకేలా పాడటం లో అప్పారావు గారిది ప్రత్యేక శైలి.
వీరి పాటలలో కొన్ని స్వీయ
రచన కాగా ,కొన్ని YOU TUBE నుండి మిత్రుల
సహకారముతో డౌన్లోడ్ చేసు కొని పాడేవి కొన్ని.
ప్రజలు- ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలూ,ప్రజాహితం
కోరి పనిచేయాలని, అంతే గాని, ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెడుతుంటే ,ఈ
విషయాల ఫై ప్రజలను వీధినాటకాల ద్వారా, పాటల ద్వారా , చైతన్య పరుస్తామని అందుకు ప్రజా
నాట్య మండలి ఎంతో సహకారం ను అందిస్తున్నదని తెలిపారు.
కళా మంజరి,నాగార్జున కళా పరిషత్, వి.టి.పి.ఎస్.
కల్చర్ల్ అసోసియేషన్ వంటి సాంస్కృతిక సంస్థ లలో సభ్యులుగా ఉన్నవీరు ,నంది
నాటకోత్సవాలు లో పాల్గొని బహుమతులు పొందారు.ఎగ్జిబిషన్ సొసైటి, విజయవాడ వారు,2014
సంవత్సరం లో ఏర్పాటు చేసిన కృష్ణ జిల్లా
కళాకారుల సన్మాన కార్యక్రమములో వీరు సన్మానం
పొందారు.
ఎంతో పుణ్యం చేసుకొంటెనో, ఈ
జన్మ వచ్చింది , కనుక ఈ జన్మ సార్ధకమయ్యేలా ,సమాజానికి తన వంతు సేవ చేయాలనేది తన
లక్ష్యమని తెలిపారు.
ప్రజలు, సాంస్కృతిక సంస్థలు
తన సేవలును ఉచితముగా వినియోగించు కోవలసిందిగా అప్పారావు గారు కోరుతున్నారు. వారు పొందిన జ్ఞాపికలు కొన్నిటి ని ఈ క్రింద చూడవచ్చు.
వీరి చిరునామా : కొండపల్లి
అప్పారావు,డోర్ నెం: 33-32,శ్రీ నాగ సాయి నగర్, బైపాస్ రోడ్,కొండపల్లి,
కృష్ణాజిల్లా-521228, Cell No : 9494848099.
Subscribe to:
Posts (Atom)