Thursday, October 19, 2017

Inspiring stories-shakeel khan

 స్వయం ఉపాధిని  సాధించిన వారిలో –Md. Shakeel Khan  ను పరిచయం చేస్తాను.
B. Sc (computers) 2008 లో జాకీర్ హుస్సన్ కాలేజీ ,ఇబ్రహింపట్నం లో చదివారు. తన గ్రాడ్యుషన్ కు ముందే , వారి బంధువుల కంప్యూటర్ షాప్ లో,  ఆసక్తి కొద్దీ కొంత పని నేర్చుకున్నారు. గ్రాడ్యుషన్ తరువాత ,పూర్తి స్థాయిలో పని చేయటం మొదలు పెట్టారు. ఇందుకోసం Hardware & Networking Course కూడా నేర్చుకున్నారు. కాని, ఆ కోర్సు పెద్దగా ఫలితమును ఇవ్వలేదు. తెలిసివారికి , తను నేర్చుకున్నది –చేస్తూ ...డబ్బు ను ఆశించకుండా ...అనుభవము మరియు వినియోగదారుడి సంతృప్తి మాత్రమే- ప్రధానముగా పని చేయటం ప్రారంభించారు.
అప్పటికి ..ఇంకా youtube channels లో ఈ కంప్యూటర్ LESSONS అంతగా లేవు. దాంతో ,మిత్రులదగ్గర కంప్యూటర్ కు సంబదించిన సి.డి .లు సేకరించి వాటిద్వారా కొంత పని నేర్చుకున్నారు. నేర్చుకొన్నదానిని Trial & Error గా చేసి, ఫలితము వచ్చే దాక కష్టపడటం!.
ఇలా కొంత custmer base సంపాదించాక ,ఒక మిత్రుడి ప్రతిపాదనతో, షాప్ పెడదామని ప్రయత్నం చేసారు. కాని, కొన్ని కారణాల వాళ్ళ అది మొదలవలేదు.
చివరకి ,బయట మార్కెట్ లో షాప్ తీసుకొని ,వాటికి good will ,rent,current ప్రారంభము లో కష్టమని, ఇక ఇంటిదగ్గరే ,షాప్ ఓపెన్ చేసి, తన వ్యాపారాన్నిప్రారంబించారు.
ఇలావుండగా ..వారి బంధువు ద్వారా..APPLE Company లో డీలర్ షిప్ ఆఫర్ వచ్చింది. అయితే ,దానికి వారి షాప్ ను రిజిస్టర్ చేయాలి ,దాని పేరున బ్యాంకు అక్కౌంట్ ఓపెన్ చేసి, దాంట్లో 6 నెలలు  కంపెనీ పేరున లావాదేవీలు నడిపినట్లుగా ప్రూఫ్ చూపించాలి...అప్పడు crazy computers  పేరుతో రిజిస్ట్రేషన్ 2008 లో చేసారు ఇవన్నీ జరిగేటప్పటికి  6 నెలలు పట్టింది. కాని ,అప్పటికి  ఈ ఆఫర్ ఇచ్చిన A.S.M అమెరికా వెళ్లి పోయాడు.
కాని.. ఈ డీలర్షిప్ ఆఫర్ మరొక కంపెనీ Accer నుంచి వచ్చింది. వాళ్ళు మెటీరియల్  క్రెడిట్ పై ఇవ్వటం నుంచి ,అన్ని విషయాలలోనూ మంచి సపోర్ట్ ఇచ్చారు.
 దాంతో, వ్యాపారం బాగా పుంజుకుంది. అలా నెమ్మదిగా ,షాప్ ను ఇంటి నుండి, కొండపల్లి మెయిన్ బజార్ కు దగ్గరగా తీసుకోవటం, అక్కడ 5 ఏళ్ళు ఉండే సరికి, ఖాళీ చేయవలసి రావటం, మళ్ళీ వెతుకులాట...మొత్తము మీద మళ్ళీ మెయిన్ రోడ్ లోనే షాప్  దొరకటం జరిగింది.
అయితే, ఈ ఎనిమిది ఏళ్ళ కాలములో ఎవర్ని దగ్గర పని చేయకుండా , కనీసము నెలకు పాతిక వేలు సంపాదించే స్థాయికి చేరుకోవటం ...వెనుక నిరంతర కృషి, ప్రతి పనిని ఆసక్తి గా నేర్చుకోవటం, మార్కెట్ లో ఉన్న అవకాసములను, అందిపుచ్చుకోవటం,ఫ్యామిలీ సపోర్ట్...లాంటివి ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు ...తన దగ్గర ఉన్న Electronic Consumer Goods ,Home credit అనే Finacial సంస్థ ద్వారా ,కంప్యూటర్, fridge,T.V ,తదితర వస్తువలను, కొన్ని పత్రాలు ,PAN Card,AAdhar card, cancelled cheque,Gas Billl,6 months bank statemetns ఇస్తే, సులభావాయిదాలలో చెల్లిచే ఏర్పాటు చేసారు- మన షకీల్ ఖాన్.


No comments:

Post a Comment