కొండపల్లి ,ఇబ్రహింపట్నం లో డెంగు జ్వరాలు ఎక్కువు అవుతున్నట్లు గా సమాచారం. ఎందుకైనా
,మంచిది ,మూడు రోజులకు కూడా జ్వరం తగక్క పోతే , డెంగు టెస్ట్ చేయించండి. అల్లాగే ,
డెంగు జ్వరము వస్తే , కార్పొరేట్ హాస్పిటల్ కి పరుగేత్తకండి. ఆ టెస్ట్ ,ఈ
టెస్ట్ చేసి -- ఏమి లేదు అని చెప్పటానికి
Rs.3500/ ,ఖర్చు పెట్టించారని ఈ రోజు ఒక మిత్రుడు చెప్పటం తో ఈ రోజు ఈ పోస్ట్
పెడుతున్నాను.
మరొక విషయం : డెంగు జ్వరం కు మోహనరావు
మొమొరియల్ హాస్పిటల్,కొండపల్లి,(Dr.mamidi seetharamaiah gaaru) లో మంచి వైద్యం
అందిస్తున్నారు. ఇది నా స్వానుభవం. అలాగని, మిమల్ని , ఈ హాస్పిటల్ కే వెళ్ళండి అని
సిఫారసు చేయటం లేదు. నాకు తెలిసింది చెప్పాను. తొందర పడి ,కార్పొరేట్ హాస్పిటల్ లు
పరుగేత్తద్దు.(మరీ ఇక్కడ ఆ సౌకర్యాలు లేకపోతే ---ఇక ఎలాగూ తప్పదు ).
స్థానికముగా కూడా మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పటమే నా ఉద్దేశ్యం.
ఇదిలా ఉంటే , ,కార్పొరేట్ హాస్పిటల్
లో కొంత మంది డాక్టర్లు, రోగి తో మాట్లాడే విధానం చూస్తే , రోగం రెట్టింపు అయ్యేలా
ఉంటోందట. అంత దరిద్రముగా ఉంటున్నారుట! ఈ మాట-గత వారము రోజులలో నేను విన్నది ఇద్దరి నోటి నుండి విన్నాను.
No comments:
Post a Comment