Friday, October 27, 2017

స్వయం ఉపాధి -B.R.Kiran

[12:44 PM, 10/27/2017] +91 72072 53159: ఈ గ్రూప్ లో స్వయం ఉపాధి ని  సాధించి- ఈ రోజున, వారే నలుగురుకి ఉద్యోగం ఇచ్చేస్థాయికి ఎదిగిన -వారిని పరిచయం చేస్తానని గతములో చెప్పాను. ఇప్పుడు వారిలో -B.R.Kiran ను పరిచయం చేస్తాను.
B.R.Kiran -Diploma in E.C.E. ను 2001వ సంవత్సరము లో పాస్ అయ్యారు.ఏప్రిల్ 2001 నుండి డిసెంబర్ 2005 వరకు MICROLINK INFORAMTION  TECHNOLOGIES,Vijayawada లో పని చేసారు. ఈ కాలము లో mother board,Monitor,system assembling, Printers  ను బాగా naipunyatha penchukunnaru .
తరువాత, 2005 సంవత్సరము December  లో HCL Infosystems Limited లో On job trainee గా అవకాశము వచ్చింది. అలా రెండు సంవత్సరములు పని చేసాక , అంటే 2007లో ఆ సంస్థలోనే పర్మనెంట్ అయ్యినది.మొదట Customer support engineer ,ఆ తరువాత ,2009 లో Sr. customer support engineer గా పదోన్నతి వచ్చింది. 2010 లో  మళ్ళీ Territory Manager గా పదోన్నతి !. Nellore, Tirupati lalo chesi 2013 vijayawada transfer ayyaryu.
ఇక అక్కడనుండి ...తన ప్రయాణంలో  మలుపు ను కోరుకున్నారు..కిరణ్.
స్వంతంగా,ఏదైనా సాధించాలన్న ,తపన ,పట్టుదలతో-July 2014 చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసారు.
అక్కడనుండి స్వంతముగా ఒక సంస్థ ను పెట్టాలన్న ఉద్దేశ్యముతో , ప్రయాణం మొదలుపెట్టారు. కేవలం పెట్టుబడి పెట్టి ,అందముగా ఆఫీసు పెట్టుకొని కూర్చుంటే కాదు కదా.!.
అందులోనూ,ఒక  వ్యాపారం విజయవంతమవ్వాలంటే- ఎన్ని విషయాలు చూడాలి!
 ఆఫీస్ ఉండే ఏరియా, దాని అంతర్గత అలంకరణ,customer base, staff recruitment ,salaries, office expenses,ఇలా అన్నీ విషయాలపై సర్వే జరిపి నాలుగు నెలల తరువాత అంటే November 2014 లో కేవలం ముగ్గురు సిబ్బంది తో, ఒక ఆఫీస్ ను కుమ్మరి పాలెం సెంటర్ లో “Akshaya innovative Technologies” పేరుతో ఒక సంస్థ ను స్థాపించడం జరిగింది. 
అయితే ,వ్యాపారం అన్నతరువాత , ఊహించని ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి !
 వాటినీ ,తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది!
business develop ayi profitsloki veluthunna timelo 2015లో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమైన తరువాత, రహదారిని విస్తరణలో తన ఆఫీస్ ను చాలావరకు నష్టపోవాల్సి  వచ్చింది.
వ్యాపారం ప్రారంభించి కేవలం ఒక సంవత్సరము కాలములో, పెట్టిన పెట్టుబడి నష్టపోయి, తిరిగి మొదట నుంచి ప్రారంభించవల్సిన పరిస్థితి!
 కిరణ్ గారు -ఆ సమయము లో ఎంతో ధైర్యముగా ,పడిలేచిన కెరటంలా......తిరిగి  గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ లో తిరిగి  తన ఆఫీస్ ను November 2016 లో ప్రారంభించారు.
 ఈ రోజు న చూస్తే –తన Custmer Base లో IOCL, IGNOU, Syndicate Bank, sandeep chemical industies, DWMA-nellore , IFFCO- nellore , Better  CAST (Auto nager,Vijayawada), ఇలాంటి సంస్థలే గాక , రిటైల్ కస్టమర్లు ఎంతో మంది.- తన దగ్గరకు వస్తుంటారు.
ఇన్ని దెబ్బలు తరువాత , ఇప్పుడే పుంజుకుంటున్న వ్యాపారం లో కూడా  తన దగ్గర ప్రస్తుతం ముగ్గురుకి అది కూడా, కనీసం ఏడువేల రూపాయిలు జీతముగా ఇవ్వగల స్థాయి లో ఉన్నారు.
 అయితే, తను ఈ  స్థాయికి రావటానికి నిరంతర శ్రమ, తను ఎన్నుకున్న రంగం లో ఎదగాలన్న పట్ట్టుదల, అన్నిటికి మించి ప్రతి ఒక్క విషయము నేర్సుకోవాలన్న ఆసక్తి –ఇవే కారణాలు అంటారు –కిరణ్.
మరి ఈ రోజు , మనము చూస్తున్నాము !.నిరుద్యోగం ప్రబలి పోయింది ---ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు లాంటి వార్తా కధనాలు చదువుతూ ఉంటాం. నిజముగా , ఈ రోజు మార్కెట్ లో ఆ పరిస్థితి ఉందా?
కిరణ్ గారి మాటలలో చెప్పాలంటే ---ఈ రోజు కాలేజీ నుంచి బయటకు వచ్చి ,ఉద్యోగం ఆశించే వారిలో నూటికి తొభై మంది, మాకు 15 వేల రూపాయిల జీతం ఇస్తారా ?అని అడిగేవారే!
 ఇస్తారు –ఎప్పుడు? మన దగ్గర ఆ స్థాయిలో పని నైపుణ్యం ఉన్నప్పుడు.
 ముందు ..పని నైపుణ్యం సంపాదించాలి. అందుకు .. బాగా కష్ట పడాలి.డబ్బు సంపాదనకంటే ...అనుభవమునకు ప్రాధాన్యం ఇవ్వాలి.  కనీసం basic knowledge కూడా లేకుండా ఉద్యోగాలకు వస్తున్నారు.
ఈ సందర్భంగా  కిరణ్ మాట్లాడతూ. Hardware networkingను,  ఆసక్తి కలవారికి  కేవలం తక్కువ ఫీజు లో  కూడా నేర్పుతానని చెబుతున్నారు .కావలసినవారు కిరణ్ గారి సంప్రదించవచ్చు.
 కాబాటి ,నిరుద్యోగులారా! చదివారుకదా, మన కిరణ్ గారి success story.
Let you too try.. all the best.

Thursday, October 19, 2017

Inspiring stories-shakeel khan

 స్వయం ఉపాధిని  సాధించిన వారిలో –Md. Shakeel Khan  ను పరిచయం చేస్తాను.
B. Sc (computers) 2008 లో జాకీర్ హుస్సన్ కాలేజీ ,ఇబ్రహింపట్నం లో చదివారు. తన గ్రాడ్యుషన్ కు ముందే , వారి బంధువుల కంప్యూటర్ షాప్ లో,  ఆసక్తి కొద్దీ కొంత పని నేర్చుకున్నారు. గ్రాడ్యుషన్ తరువాత ,పూర్తి స్థాయిలో పని చేయటం మొదలు పెట్టారు. ఇందుకోసం Hardware & Networking Course కూడా నేర్చుకున్నారు. కాని, ఆ కోర్సు పెద్దగా ఫలితమును ఇవ్వలేదు. తెలిసివారికి , తను నేర్చుకున్నది –చేస్తూ ...డబ్బు ను ఆశించకుండా ...అనుభవము మరియు వినియోగదారుడి సంతృప్తి మాత్రమే- ప్రధానముగా పని చేయటం ప్రారంభించారు.
అప్పటికి ..ఇంకా youtube channels లో ఈ కంప్యూటర్ LESSONS అంతగా లేవు. దాంతో ,మిత్రులదగ్గర కంప్యూటర్ కు సంబదించిన సి.డి .లు సేకరించి వాటిద్వారా కొంత పని నేర్చుకున్నారు. నేర్చుకొన్నదానిని Trial & Error గా చేసి, ఫలితము వచ్చే దాక కష్టపడటం!.
ఇలా కొంత custmer base సంపాదించాక ,ఒక మిత్రుడి ప్రతిపాదనతో, షాప్ పెడదామని ప్రయత్నం చేసారు. కాని, కొన్ని కారణాల వాళ్ళ అది మొదలవలేదు.
చివరకి ,బయట మార్కెట్ లో షాప్ తీసుకొని ,వాటికి good will ,rent,current ప్రారంభము లో కష్టమని, ఇక ఇంటిదగ్గరే ,షాప్ ఓపెన్ చేసి, తన వ్యాపారాన్నిప్రారంబించారు.
ఇలావుండగా ..వారి బంధువు ద్వారా..APPLE Company లో డీలర్ షిప్ ఆఫర్ వచ్చింది. అయితే ,దానికి వారి షాప్ ను రిజిస్టర్ చేయాలి ,దాని పేరున బ్యాంకు అక్కౌంట్ ఓపెన్ చేసి, దాంట్లో 6 నెలలు  కంపెనీ పేరున లావాదేవీలు నడిపినట్లుగా ప్రూఫ్ చూపించాలి...అప్పడు crazy computers  పేరుతో రిజిస్ట్రేషన్ 2008 లో చేసారు ఇవన్నీ జరిగేటప్పటికి  6 నెలలు పట్టింది. కాని ,అప్పటికి  ఈ ఆఫర్ ఇచ్చిన A.S.M అమెరికా వెళ్లి పోయాడు.
కాని.. ఈ డీలర్షిప్ ఆఫర్ మరొక కంపెనీ Accer నుంచి వచ్చింది. వాళ్ళు మెటీరియల్  క్రెడిట్ పై ఇవ్వటం నుంచి ,అన్ని విషయాలలోనూ మంచి సపోర్ట్ ఇచ్చారు.
 దాంతో, వ్యాపారం బాగా పుంజుకుంది. అలా నెమ్మదిగా ,షాప్ ను ఇంటి నుండి, కొండపల్లి మెయిన్ బజార్ కు దగ్గరగా తీసుకోవటం, అక్కడ 5 ఏళ్ళు ఉండే సరికి, ఖాళీ చేయవలసి రావటం, మళ్ళీ వెతుకులాట...మొత్తము మీద మళ్ళీ మెయిన్ రోడ్ లోనే షాప్  దొరకటం జరిగింది.
అయితే, ఈ ఎనిమిది ఏళ్ళ కాలములో ఎవర్ని దగ్గర పని చేయకుండా , కనీసము నెలకు పాతిక వేలు సంపాదించే స్థాయికి చేరుకోవటం ...వెనుక నిరంతర కృషి, ప్రతి పనిని ఆసక్తి గా నేర్చుకోవటం, మార్కెట్ లో ఉన్న అవకాసములను, అందిపుచ్చుకోవటం,ఫ్యామిలీ సపోర్ట్...లాంటివి ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు ...తన దగ్గర ఉన్న Electronic Consumer Goods ,Home credit అనే Finacial సంస్థ ద్వారా ,కంప్యూటర్, fridge,T.V ,తదితర వస్తువలను, కొన్ని పత్రాలు ,PAN Card,AAdhar card, cancelled cheque,Gas Billl,6 months bank statemetns ఇస్తే, సులభావాయిదాలలో చెల్లిచే ఏర్పాటు చేసారు- మన షకీల్ ఖాన్.


Tuesday, October 10, 2017

Civil Engineering EBook Collection

[07:33, 10/7/2017] Somsyajulu: Civil Engineering EBook Collection

Handbook of Transportation Engineering
http://www.onlinecivil.net/2017/09/handbook-of-transportation-engineering.html

Structural Foundation Designers Manual
http://www.onlinecivil.net/2017/09/structural-foundation-designers-manual.html

Geotechnical Engineering
http://www.onlinecivil.net/2017/09/geotechnical-engineering.html

Design of Concrete Structures
http://www.onlinecivil.net/2017/09/design-of-concrete-structures.html

Site Engineers Manual
http://www.onlinecivil.net/2017/09/site-engineers-manual.html

Structural Engineer’s Book
http://www.onlinecivil.net/2017/09/structural-engineers-book.html

Civil Engineering Project Management
http://www.onlinecivil.net/2017/09/civil-engineering-project-management.html

Advanced Concrete Technology
http://www.onlinecivil.net/2017/09/advanced-concrete-technology.html

Reinforced Concrete Design Principles and Practice
http://www.onlinecivil.net/2017/09/reinforced-concrete-design-principles.html

Standard Handbook for Civil Engineers
http://www.onlinecivil.net/2017/09/standard-handbook-for-civil-engineers.html

Planning and Design of Airports
http://www.onlinecivil.net/2017/09/planning-and-design-of-airports.html

Aircraft Interior Comfort and Design
http://www.onlinecivil.net/2017/09/aircraft-interior-comfort-and-design.html

Airport Engineering
http://www.onlinecivil.net/2017/09/airport-engineering.html

CRSI Design Handbook
http://www.onlinecivil.net/2017/09/crsi-design-handbook.html

Handbook of Civil Engineering Calculations
http://www.onlinecivil.net/2014/04/handbook-of-civil-engineering.html

Building Code Requirements for Structural Concrete
http://www.onlinecivil.net/2017/09/building-code-requirements-for.html

Standard Specifications for Road, Bridge, and Municipal Construction
http://www.onlinecivil.net/2017/09/standard-specifications-for-road-bridge.html

AutoCAD Workbook for Architects and Engineers
http://www.onlinecivil.net/2017/09/autocad-workbook-for-architects-and.html

Soil Engineering Testing,Design And Remediation
http://www.onlinecivil.net/2017/09/soil-engineering-testingdesign-and.html

Structural Design of Steelwork
http://www.onlinecivil.net/2017/09/structural-design-of-steelwork.html

Practical Civil Engineer Handbook By P.N. Khanna
http://www.onlinecivil.net/2017/09/practical-civil-engineer-handbook-by-pn.html
[07:36, 10/7/2017] +91 72072 53159: 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

SC ST అట్రాసిటి కేసులు

SC ST అట్రాసిటి కేసులు నమోదు అయితే ఇకపై అరెస్టులు లేవు... 41a సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశించింది..... కాబట్టి కేసులకు భయపడి తొందర పడి లక్షల సొమ్ము ముట్ట జెప్పద్దు..... చట్ట ప్రకారం పోరాడి తప్పుడు కేసులని నిరూపించండి........ తప్పుడు అట్రాసిటి కేసులు పెట్టిన వారిపై పరువునష్టం దావా,క్రిమినల్ కేసులు వేయండి....
    ఈ విషయం మన సోదరులందరికీ కి తెలిసే విధంగా షేర్ చేయండి..

కొండపల్లి ,ఇబ్రహింపట్నం లో డెంగు జ్వరాలు ఎ

కొండపల్లి ,ఇబ్రహింపట్నం లో డెంగు జ్వరాలు ఎక్కువు అవుతున్నట్లు గా సమాచారం. ఎందుకైనా ,మంచిది ,మూడు రోజులకు కూడా జ్వరం తగక్క పోతే , డెంగు టెస్ట్ చేయించండి. అల్లాగే , డెంగు జ్వరము వస్తే , కార్పొరేట్ హాస్పిటల్ కి పరుగేత్తకండి. ఆ టెస్ట్ ,ఈ టెస్ట్  చేసి -- ఏమి లేదు అని చెప్పటానికి Rs.3500/ ,ఖర్చు పెట్టించారని ఈ రోజు ఒక మిత్రుడు చెప్పటం తో ఈ రోజు ఈ పోస్ట్ పెడుతున్నాను.
మరొక విషయం : డెంగు జ్వరం కు  మోహనరావు మొమొరియల్ హాస్పిటల్,కొండపల్లి,(Dr.mamidi seetharamaiah gaaru) లో మంచి వైద్యం అందిస్తున్నారు. ఇది నా స్వానుభవం. అలాగని, మిమల్ని , ఈ హాస్పిటల్ కే వెళ్ళండి అని సిఫారసు చేయటం లేదు. నాకు తెలిసింది చెప్పాను. తొందర పడి ,కార్పొరేట్ హాస్పిటల్ లు పరుగేత్తద్దు.(మరీ ఇక్కడ ఆ సౌకర్యాలు లేకపోతే ---ఇక ఎలాగూ తప్పదు ).
స్థానికముగా కూడా మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పటమే నా ఉద్దేశ్యం.

ఇదిలా ఉంటే ,  ,కార్పొరేట్ హాస్పిటల్ లో కొంత మంది డాక్టర్లు, రోగి తో మాట్లాడే విధానం చూస్తే , రోగం రెట్టింపు అయ్యేలా ఉంటోందట. అంత దరిద్రముగా ఉంటున్నారుట! ఈ మాట-గత వారము రోజులలో నేను విన్నది  ఇద్దరి నోటి నుండి విన్నాను.

50 సంవత్సరాలు, ఆ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు

50 సంవత్సరాలు, ఆ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు ఈ మెసేజ్ ని శ్రధ్ధగా చదవండి.. ఎందుకంటే రాబోయే జీవితానికి ఇది చాలా పనికివస్తుంది..
సుఖమయమైన వృధ్ధాప్యం కోసం..
1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి..
2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి.
3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.
4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...
5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..
6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.
7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి...
8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి.
9. ప్రార్ధించండి కాని, అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు.... చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి.
10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి..పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే...
11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి... మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి.
12. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరు కు వెళ్ళిరండి.. దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది.
13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోంది... ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి.
14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను విశ్వసించండి..
15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి..
అందరికీ సుఖమయ జీవన శుభాకాంక్షలు...

Job opportunity

పనిప్రదేశము: విజయవాడ.సత్యనారాయణ పురం.
జీతం : రూ.12000/
సమయం : 10 am to 6 PM.
Job description: Need to fill 100 forms by observing given data which will be USA English.
Selection procedure: Min.5 days testing.If the candidate fail to catch the work, he Will be removed with out paying a single penny.
If he is successful in catching the work, his testing period will also be paid.
Skills needed: English understand, Fast typing.
Qualification: min inter/degree.
Other information: sunday and monday holidays.(only 5 day's work})

ఒక కారు తయారీ కంపెనీ యజమాని

[15:50, 10/10/2017] KLU: ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీయర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.

ఆ ఇంజనీయర్ " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.

ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు కొన్ని ఇంచులు ఎత్తుగా ఉంది.

కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీయర్ లోలోపల చింతించసాగాడు.

తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమాని ఆలోచించసాగాడు.

అక్కడే ఉన్న "ఫేంటర్" కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.

"ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని ఇంజనీయర్ సలహా ఇచ్చాడు.

ఈ రెండు సలహాలు విని యజమాని కన్వీనెన్స్ కాలేక పోయాడు.ఎందుకంటే అలా కారుకు నొక్కులూ,గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.

జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న "వాచ్ మెన్ " భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.

అక్కడున్నవాళ్ళు " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..

ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు.

"కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా కొన్ని ఇంచులే ఎత్తుగా ఉందికదా సార్! కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.

వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.

                          ✡✡✡✡✡

కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం  తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!!

ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి  తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా..

"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు!! "

...ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.

మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)  వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.

అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!

కొంత గాలి (ఇగో) తీసివేసి...ఎత్తును (ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి.

నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన "ఆత్మ" కలవారం!!

కానీ,

""అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!

ఈ చెత్తానంతా తొలగించుకుంటున్నా కొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!! ""

                           ✡✡✡✡✡

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.
[16:17, 10/10/2017] +91 72072 53159: 👏
👏
[17:04, 10/10/2017] Fire Sastry: 

కొండపల్లి ,ఇబ్రహింపట్నం లో డెంగు జ్వరాలు

కొండపల్లి ,ఇబ్రహింపట్నం లో డెంగు జ్వరాలు ఎక్కువు అవుతున్నట్లు గా సమాచారం. ఎందుకైనా ,మంచిది ,మూడు రోజులకు కూడా జ్వరం తగక్క పోతే , డెంగు టెస్ట్ చేయించండి. అల్లాగే , డెంగు జ్వరము వస్తే , కార్పొరేట్ హాస్పిటల్ కి పరుగేత్తకండి. ఆ టెస్ట్ ,ఈ టెస్ట్  చేసి -- ఏమి లేదు అని చెప్పటానికి Rs.3500/ ,ఖర్చు పెట్టించారని ఈ రోజు ఒక మిత్రుడు చెప్పటం తో ఈ రోజు ఈ పోస్ట్ పెడుతున్నాను.
మరొక విషయం : డెంగు జ్వరం కు  మోహనరావు మొమొరియల్ హాస్పిటల్,కొండపల్లి,(Dr.mamidi seetharamaiah gaaru) లో మంచి వైద్యం అందిస్తున్నారు. ఇది నా స్వానుభవం. అలాగని, మిమల్ని , ఈ హాస్పిటల్ కే వెళ్ళండి అని సిఫారసు చేయటం లేదు. నాకు తెలిసింది చెప్పాను. తొందర పడి ,కార్పొరేట్ హాస్పిటల్ లు పరుగేత్తద్దు.(మరీ ఇక్కడ ఆ సౌకర్యాలు లేకపోతే ---ఇక ఎలాగూ తప్పదు ).
స్థానికముగా కూడా మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పటమే నా ఉద్దేశ్యం.


ఇదిలా ఉంటే ,  ,కార్పొరేట్ హాస్పిటల్ లో కొంత మంది డాక్టర్లు, రోగి తో మాట్లాడే విధానం చూస్తే , రోగం రెట్టింపు అయ్యేలా ఉంటోందట. అంత దరిద్రముగా ఉంటున్నారుట! ఈ మాట-గత వారము రోజులలో నేను విన్నది  ఇద్దరి నోటి నుండి విన్నాను.