Thursday, December 15, 2016

పెద్దనోట్లు రద్దు అయి ,నేటికి నెలరోజులు పైగా అయినది. ప్రభుత్వం ఈ చర్యను సమర్ధించుకోవడం,ప్రతిపక్షము వారు విమర్శచేయటం చూస్తున్నాము. ఇది మంచా ,చెడా  అన్న విషయాన్ని తర్కించే కంటే, ఈ నగదు రహిత లావాదేవీలు జరపటం తప్పనిసరిగా కన్పిస్తోంది. కాబట్టి, మనం ప్రస్తుత కర్తవ్యం ` ఈ నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం ఎలా ? అనేది తెలుసుకోవాలి.   ఈ  నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం ఎలా ? అనేది నాకు తెలిసినంతవరకు మీకు తెలియపరుస్తాను. ఈ రోజు మనకు ఎన్నో ఇ` వాలెట్లు మార్కెట్‌ లో ఉన్నాయి. వాలెటు అంటే డబ్బు దాచుకునే  పర్సు అని, `వాలెట్‌ అంటే ఎలక్ట్రానిక్‌ పర్సు అని అర్ధం. ఇవి  బయట ఎక్కడా దొరకవు, ఒక్క ఇంటర్నెట్‌ లో మాత్రమే లభ్యం అవుతాయి.

ఈ వాలెట్లు లో పెటియమ్‌, ఆక్సిజన్‌వాలెట్టు,ఎయిర్‌టెల్‌ మనీఐడియామనీ ఇలా కొన్నికంపెనీ వాలెట్లు , అలాగే, ప్రభుత్వసంస్థలైన ఎ.పి.యస్‌.ఆర్‌.టి.సి. ,రైల్వే లకు కూడా ఇ` వాలెట్లు ఉన్నాయి.కంపెనీ వాలెట్ల ద్వారా,మనము మొబైల్‌ ఫోన్‌ కు రీచార్జ్‌,యేదైనా బ్యాంక్‌ ఎకౌంటు కు డబ్బు పంపటం, షాపింగ్‌ చేయటం,లాంటివి చేయవచ్చు. మరి, ఈ వాలెట్టు లోకి డబ్బు పంపటం ఎలా?
  మన డెబిట్‌ కార్డు ద్వారాగాని, క్రెడిట్‌ కార్డు ద్వారాగాని, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా గాని ,డబ్బు పంపవచ్చు. ప్రస్తుతం పెటియమ్‌ వాలెటు బాగా ప్రాచుర్యంలో ఉన్నది. 

No comments:

Post a Comment