Saturday, February 9, 2019

నేషనల్ హై వేస్ -వ్యతిరేక మార్గం లో ప్రయాణం

నేషనల్ హై వేస్ -వ్యతిరేక మార్గం లో ప్రయాణం
ఈ మధ్య కాలము లో నేషనల్ హై వేస్ ను బాగా అభివృధి పరిచారు. ఈ నేపధ్యంలో...ఎన్నో గ్రామాల మీదుగా ఈ హై వేస్  వెళ్తూ ఉండటం .. సరియిన సర్వీస్ రోడ్లు రూప కల్పనా చేయక పోవటం తో ..ప్రజలకు చాలా ఇబ్బందు లు ఎదురవుతున్నయి. అవసరైన ప్రదేశాలలో డివైడర్ లో ఖాళీ ఇవ్వక పోవటం ,తద్వారా..ఎంతో దూరం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అన్న భావనతో..ప్రజలు వ్యతిరేక మార్గం లో రావటం అలవాటు చేసుకుంటున్నారు .ఫలితము .. ..తరుచు గా రోడ్ ప్రమాదాలు జరగటం.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఈ వ్యతిరేక మార్గము లో ప్రయాణించడం అనేది తప్పుగా ప్రజలు భావించినట్లుగా మనకు కనిపించదు. దీనిలో చదువుకున్న వారు తో సహా అందరూ ఉన్నారు. దీనికి నివారణగా 

  • ప్రభుత్వం వీలు అయిన చోట డివైడర్ లో ఖాళీ  లు ఏర్పాటు చేయడం ..
  • ప్రజలలో రహదారులపై వ్యతిరేక మార్గం లో ప్రయాణించడం తప్పుఅని, దానివల్ల జరిగే అనర్థాలను   మీడియా ద్వార బాగా ప్రచారం చేయటం., 
  • ఇలా చేసేవారికి ట్రాఫిక్ రూల్స్  అతిక్రమణగా గా ఫైన్ వేయటం చేస్తే కొంత వరకు పరిస్థితి మెరుగుఅవ్వవచ్చు

No comments:

Post a Comment