Friday, February 8, 2019

ఈనాటి విద్యార్థులు

*ఈనాటి విద్యార్థులు*

నిజానికి..ఈ నాటి విద్యార్థి పై చదువుల వత్తిడి ఎంతో ఉంది.
పుట్టిన దగ్గర నుంచి మహా అయితే..మూడు సంవత్సరాలు ఇంట్లో ఉంటాడేమో(కొంత మంది కి ఆ భాగ్యం కూడా లేదు...చైల్డ్ కేర్ సెంటర్ లే గతి).
ఆ తదుపరి.. ప్రీ నర్సరీ అని,నర్సరీ అని...తోమి న తరువాత...అప్పుడు మొదటి తరగతి....ఇక ఇక్కడనుండి మొదలు..స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్..మార్క్స్, రాంక్స్ గోల... దాదాపు 20 ఏళ్లు సాగుతుంది.

11 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నేటి పిల్లలకు యవ్వన ఛాయలు కనిపిస్తున్నాయి.
ఇక ఇక్కడనుండి.. స్మార్ట్ ఫోన్ పరిచయం....తక్కువ ధర కలిగిన ఇంటర్నెట్ ప్యాకేజీ ల పుణ్యమా అని..అవసరం కు మించిన వినియోగం.

స్మార్ట్ ఫోన్ లో... మన పిల్లలు ఏమి చూస్తున్నారో.. తెలుసుకొనే ఓపిక లేని తల్లిదండ్రులు.. ఏది చూడకూడదో.. అది చూడాలని తలచే యవ్వన ఛాయలు..
తల్లిదండ్రులు కేరింగ్ సరిగా లేక తమ ను కేరింగ్ గా చూస్తున్నారు అని అనుకుంటున్న ఆపొజిట్ సెక్స్ వైపు చూపులు..వెరసి..సామాజిక సమస్యలు..

పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తము గా భావించడం...పనికి మాలినిన కొన్ని తెలుగు సీరియళ్లు... యు ట్యూబ్ వీడియో లు....వీళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మార్కులే ప్రాతిపదికన పిల్లల తెలివితేటలు అంచనా వేయడం.. వారికి ఇష్టమైన కోర్సు చదవిచటానికి ..తల్లిదండ్రులు ఒప్పుకోక పోవటం..నచ్చని కోర్సులో చేరి..భారంగా డిగ్రీలు సంపాదించటం.. దాంతో.. ఉద్యోగాలు రాక...నిరుద్యోగులుగా మారి..ఆ తదుపరి..ఈజీ మనీ వచ్చే దారులు వెతికి...అసాంఘిక శక్తులుగా మారటం..

దీనిలో..ప్రభుత్వాల పాత్ర ఏమీ తీసి పోదు..
ఏ సంవత్సరం ..ఏ సబ్జెక్టు సిలబస్ మారుస్తారో,, మారిన టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు అందుతాయో.. ఏ పరీక్ష ఎప్పుడు పెడతారో.. ఏది క్యాన్సల్ చేస్తారో తెలియని అయోమయ్యా స్థితిని  ఈ ప్రభుత్వాలు కలగ జేస్తున్నాయి.
వెరసి..విద్యార్థి కి ఈ దుస్థితి రావటానికి...ప్రభుత్వం, తలిదండ్రులు, సమాజము...అందరూ బాద్యులే..
వీరందరూ..ఎవరి బాధ్యత ను వారు సక్రమంగా..నిజాయితీ గా నిర్వహించిన రోజు...విద్యార్థి. భవిష్యత్తు. ఎంతో బాగుంటుంది.

No comments:

Post a Comment