Sunday, June 19, 2016

ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆద్వర్యం లో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు కొన్ని స్టేషనరీ వస్తువులు ఉచితంగా పంపిణి

ఈ రోజు అనగా ది.19.06.2016,ఆదివారము ,కొండపల్లి లో ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆద్వర్యం లో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు కొన్ని స్టేషనరీ వస్తువులు ఉచితంగా పంపిణి చేయటం జరిగింది .
ఈ సందర్భముగా ఫౌండేషన్ సభ్యుడు రెహమత్ మాట్లాడుతూ – గత 4 సంవత్సరాలుగా, ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. విద్యార్థులు కేవలం పాట్యపుస్తకాలనే కాక , భగవత గీత,ఖురాన్, బైబిల్ వంటి మత గ్రందహాలను కూడా చదవటం అలవరచు కోవాలని కోరారు.
మరొక ఫౌండేషన్ సభ్యుడు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ – ఫౌండేషన్ అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి పద్మ మాట్లాడుతూ-మూస ధోరణిలో ఆలోచింటం మానితేనే ,ఉన్నత శిఖరాలకు చేరతామని సోదాహరణంగా వివరించారు. త్వరలోనే 100% హాజరు కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని, మొక్కలు నాటాలి ,వాటిని పరిరక్షణ కూడా చెబుతూ , స్కూల్ దగ్గర పాతిన మొక్కలను వేసవిసెలవలలో పరిరక్షణ విద్యార్దిని కి చిన్న బహుమతి ఇచ్చారు.
అనంతఃరం ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థుల సహకారముతో స్కూల్ ఆవరణ లో మొక్కను నాటారు.
చిన్నారుల నృత్య ప్రదర్సన అనంతరం, విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు కొన్ని స్టేషనరీ వస్తువులు ఉచితంగా పంపిణి చేయటం జరిగింది.

 ఆ స్కూల్ టీచర్స్ మాట్లాడుతూ, తల్లితండ్రుల సహకారము వుంటే త్వరలోనే ఈ స్కూల్ అప్పర్ ప్రైమరీస్కూలు అవుతుందని తెలిపారు.  ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ వారు తమ స్కూల్ విద్యార్థులకు అందిస్తున్న  ప్రోత్సాహం చా ఆనందాయకముగా ఉందని ,తల్లితండ్రులు, ఆ స్కూల్ టీచర్స్ తెలిపారు. 
Photos

No comments:

Post a Comment