Saturday, April 7, 2018

అనారోగ్యం తో బా

గ్రూపు సభ్యులకు శుభోదయం.

ఇటీవల మన గ్రూప్ కు అనారోగ్యం తో బాధ పడుతున్నామని,మందుల కొనుగోలుకు, పిల్లల ఫీజు చెల్లింపు లో బాకీ ఉండి, కట్ట లేకపోతున్నామని...ఇలా..మన నుంచి ఆర్థికపరమైన సాయం కోరుతూ బాధితులు వస్తున్నారు...వారికి..సాయం చేస్తామని...దాతలూ..నాకు..ఫోన్ ద్వారానో..గ్రూపులో పోస్ట్ చేయడం ద్వారానో తెలుపుతున్నారు.. కానీ...వీరి. సాయం సకాలంలో అందక బాధితులు నాకు ఫోన్ చేసి..మాకు వారి సాయం అందుతుందా.. అంటూ ఆశగా అడుగుతున్నారు.
. కాబట్టి...మనసున్న మారాజులు.. మీరు చేయగల సాయం..అది ఎంత చిన్నదైనా..సకాలంలో అందించవలసినదిగా ప్రార్థన.

పేద బ్రాహ్మణ కుటుంబం క్యాటరింగ్

హైదరాబాద్ లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం క్యాటరింగ్ పని నిర్వహించు కుంటూ, ఉన్న ఒక్కగానొక్క కొడుకు ను, దాతలు అందించినసాయంతో  రెండు సంవత్సరాల నుండి ఇంజినీరింగ్ కోర్సు (CSE)చదివిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం దాతలనుండి....తగు ఆర్ధిక సాయం అందకపోవడంతో...మూడవ సంవత్సరము ఫీజు కట్టే దారి తెలియక బాధ పడుతున్నారు. 10 ఏప్రిల్ 2018 నుండి..అతనికి ఈ సంవత్సరం ఆఖరి పరీక్ష ల హాలు టికెట్ ను..అతను కట్టవల్సిన రూ.20000/ (ఇరువది వేల రూపాయలు)...కడితే మాత్రమే ఇచ్చే సూచన ఉన్నది.అప్పు చేయాలంటే... తీర్చలేకపోతామని భయంతో ఈ కుటుంబం ఉన్నది. ఈ కుర్రవాడి మార్కులు SSC లో A+ గాను,ఇంటర్ లో 98% గాను ఉన్నాయట. ప్రస్తుతం ఇంజినీరింగ్ లో 70% మార్కులతో ఉన్నాడు. దాతల కోరితే.. అతని కి ఇప్పటివరకు వచ్చిన మార్కుల జాబితా పంపగలరట. దయచేసి..దాతలు స్పందించవలసినదిగా కోరుతున్నారు.


[8:11 PM, 4/5/2018] +91 72072 53159: వీరికి...వెలది వెంకటేశ్వరరావు గారు...వీరి స్థితి గతులను,,ఫోన్ ద్వారా స్వయముగా విచారించి...వారికి కావలిసిన పూర్తి మొత్తము రూ.20000/(ఇరువది వేల రూపాయలు) ఈ రోజు వారి బ్యాంక్ అకౌంట్ కు చేరాలా చేశారు.
[8:12 PM, 4/5/2018] +91 72072 53159: సకాలములో..ధనము అందటం తో... ఆ కుటుంబము ..దాతకు పలువిధాల కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిఖిల్(ఆస్టేలియా) తరువాత..అంద మొత్తమును...మాతృశ్రీ గ్రూప్ లో వచ్చిన వార్తకు స్పందనగా అందించిన దాత వెలది వెంకటేశ్వరరావు గారికి మాతృశ్రీ గ్రూప్ అడ్మిన్ గా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

కార్మికులా ,.....,baanisalaaa


Dharma soortraalu

Friday, March 16, 2018

ఫార్మా –డి చదివిన విద్యార్థుల పాట్లు

                          ఫార్మా –డి చదివిన విద్యార్థుల పాట్లు
      ప్రభుత్వం- ప్రజల సంక్షేమము చూడటంలో ఎంత ఘోరముగా విఫలమవుతోందో తెలపటానికి ఫార్మా-డి నిరుద్యోగులే
 నిదర్శనం. ఇంటర్మీడియట్ తరువాత ,సుమారు 10 లక్షలు పోసి ,ఆరు ఏళ్ళు ఫార్మసీ విద్య చదివి, దాదాపు 
  డాక్టర్ తో సమానమైన విద్యార్థులు, కోర్సు పూర్తి చేసి వచ్చిన తరువాత ,ఉద్యోగం లేక అల్లాడు తున్నారు.
      pharma-D(Doctor of Pharmacy)అనే కోర్సు , కేంద్ర ప్రభుత్వం చే pharmacy act 1948 చట్టం క్రింద,
Pharmacy council of India (P.C.I) ఆమోదం తో ఏర్పాటు చేయబడిన కోర్సు. ఐదు ఏళ్ళు చదువు
మరియు ఒక ఏడాది ఇంటర్న్షిప్ ను  పేరొందిన హాస్పిటల్ లో  చేసినతరువాత, మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇస్తారు.
కోర్సు తరువాత, వీరిని వైద్య శాఖ నందు ఏ పోస్ట్  లో  ఉంచాలో స్పష్టమైన  విధానము లేక పోవటం తో, 
ఈ రోజున, కష్ట పడి ఈ కోర్సు చదివిన విద్యార్థికి భవిషత్తు లేక అల్లాడు తున్నాడు!.
            ఈ విద్యకు విదేశాలలో చక్కని ప్రాచుర్యం ఉంది.   అక్కడ - డాక్టర్ చేత వ్యాధి నిర్ధారణ జరిగిన
 తరువాత,అందుకు సంబంధించిన మందులను Pharama-D చదివిన వారేఇస్తారు. మన దేశం లో మాత్రం, 
ఈ కోర్సు చదివినవారు కేవలం మెడికల్ representative గా ఉంటున్నారు.
 ఫార్మసీ విద్యలో ..డి.ఫార్మసీ, బి.ఫార్మసీ చదివినవారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి గాని, వీరికి మాత్రం ఉద్యోగాలు లేవు.
 బి.ఫార్మసీ చదివినవారికి ఈ కోర్స్ లో 4 వ సంవత్సరం లేటరల్ ఎంట్రీ గా ప్రవేశం కలిపిస్తారు.
        అంతటి ఉన్నతమైన కోర్సు కు ...ప్రభుత్వాలు ఈ గతి పట్టిస్తున్నాయి!.
 నూతన కోర్సు ను ప్రారంభించే తప్పుడు చేసే హడావుడి, వీరికి ఉద్యోగ కల్పన కానరావటం లేదు.
 ఫలితముగా సుమారు 9000మంది విద్యార్థులు,ఏటా ..ఈ విద్య నభ్యసించి బయటకు వచ్చి నిరుద్యోగులుగా 
మిగులుతున్నారు. దేశ వ్యాప్తముగా ఉన్న 219 pharma-D కాలేజీలలో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 59 కాలేజీ, 
ఉన్నాయంటే ..పరిస్థితి ని అర్థము చేసుకోవచ్చు!.
   చాల కొద్ది పాటి ట్రైనింగ్ తో ..డాక్టర్ లు అందించే సేవలను వీరూ ..అందించగలరు.ఎన్నో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో,
 మరియు ఇతర గ్రామీణ ప్రాంతాలలో, నేటికి సరియిన వైద్యుడు లేక ,అరకొరగా వైద్యం తెలిసినవారినబడి ..
ఎన్ని ప్రాణాలు పోతున్నాయో గమనించాలి. ప్రభుత్వం ఇప్పటి కైనా మేలుకోవాలి. 
వీరికి సరైన ఉపాధి మార్గము చూపి , యువతలో ఉన్న నిరాశ ను పోగొట్టాలి.లేకపోతే .. 
ఈ కోర్సు చదివిన యువతకు ఒక రకమైన నైరాశ్యం కూడు కొని...సమాజములో ఇబ్బందికర పరిస్థితులు
తలఎత్తుతాయి.