పొన్నూరు వీరాం జనేయ స్వామి దేవాలయదర్శనం...నా అనుభవం.
ది.02.12.2018 (ఆదివారం), గుంటూరు జిల్లా, పొన్నూరు లో ఉన్న శ్రీ వీరంజనేయ స్వామి వారి దేవస్థానం(ఫోన్:08643-247099) కు
వెళ్ళటం జరిగింది.
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం నుండి పొన్నూరు కు సుమారుగా 85 km దూరం ఉంటుంది. గుంటూరు హై వే నుండి గుంటూరు ఊరి బయట నుండి
, సర్వీసు రోడ్ కు వెళ్ళి, తెనాలి రోడ్ లో వెళ్ళాలి.కార్ లో రెండు గంటల ప్రయాణం. ఈ దేవాలయం R.T.C బస్టాండ్ కు అతి సమీపము లో ఉంది. మెయిన్ రోడ్ ప్రక్కనే ...దేవాలయం..
ఆ రోజు..ఆకుపూజ చేయించు కొందా మంటే..ఆరోజు ఆ పూజ లేదన్నారు.. సరే... అష్టోత్తరము (రూ.20/)(ఇద్దరికి మాత్రమే అనుమతి), చేయించుకొన్నాము.
అనంతరం.... ఆ ఆలయపరిసరము లోనే ఉన్న, సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం, (ఇక్కడి నంది విగ్రహం చెవిలో మన కోరిక చెబితే .
ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం),కాలభైరవ స్వామి ఆలయం, విష్ణువు దశావతారఆలయం, అతి పెద్ద గరున్మంతుని ఆలయం
(కొత్త గా కట్టింది), వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించు కొన్నాము.
పెద్ద కోనేరు(నీళ్లు లేవు), నిత్య అన్నదాన సత్రం(ఉదయం 12.30 గం:కు ప్రారంభం.... టికెట్స్ గుడి దగ్గరే ఇస్తారు..) లను చూసాము.
అక్కడే..ఎత్తయిన టవర్ పై 365 రోజులు ఆవునెయ్యితో వెలిగించే...అఖండదీపం ను దర్శించు కొన్నాము. ఇలాంటివి..ఆ ప్రాంగణము లో
ఐదు ఉన్నాయట.
అయితే.......... నాకు అసౌకర్యం అనిపించిన విషయాలు....
.1. టిక్కెట్ కౌంటర్ దగ్గర... మైక్ లో అదే పనిగా ..పెద్ద సౌండ్ తో...భక్తులకు ఏ టికెట్ ఎంత....క్యూలో వెళ్ళాలి... లాంటివి....విరామం లేకుండా...
పదే, పదే చెప్పడం..కొంత చికాకు గా అనిపించింది..
2. నిత్య అన్నదానం వివరాలు గురుంచి.. ఎక్కడా ప్రకటన బోర్డ్ గాని, మైకు లో దాని కి సంబంధించిన సమాచార ము ఎక్కడా లేదు..
3.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండటం తో....ఎంత సేపు. టికెట్, డబ్బు ఏవ తప్ప... ఆధ్యాత్మిక వాతావరణం కనిపించదు..
దగ్గరలోనే.. పురాతన దేవాలయం భావనారాయణ దేవాలయం ఉందట..కానీ, మేము వెళ్ళలేదు...
|
No comments:
Post a Comment