ఈ రోజు (09.12.2018, ఆదివారం), విజయవాడలో పాయకాపురం దగ్గర న్యూ రాజీవనగర్ లోని..ప్రాంతీయ ఆయుర్వేద చర్మ రోగ పరిశోధన సంస్థ(Regional Ayurveda Research institute for skin disorders,)వెళ్ళటం జరిగింది.
దాదాపు మూడు అంతస్థుల భవనం అది..
అత్యాధునిక సౌకర్యము లతో..చర్మ సంబంధ వ్యాధులకు చక్కని చికిత్స ను అందిస్తున్నారు.
ప్రభుత్వం ఆద్వర్యంలో నడిచే..హాస్పిటల్ అంటే..నమ్మ బుద్ది కాదు..
కేంద్ర ప్రభుత్వ అధీనము లోని Ministry of Ayush
ఆద్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ ఇది.
ఇవే గాక..దేశ వ్యాప్తంగా.. ఇంకా పలు రకాల వ్యాధులు.. ఉదాహరణకు... గుండె, వూపిరితిత్తులు, క
క్యాన్సర్, కంటి జబ్బులు, తల్లిబిడ్డ సంక్షేమం, మూత్ర సంబంధ,మానసిక అనారోగ్యం, లకు ఇలాంటి హాస్పిటల్స్ లో న్యూ ఢిల్లీ, పటియాల, హైదరాబాద్, లక్నో , బెంగుళూరు, ఇలా..దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో చికిత్స జరుగుతున్నాయి.
మరిన్ని వివరాలకు....www.ccras.nic.in