Thursday, January 25, 2018

రధ సప్తమి పూజ విధానం

[12:55 AM, 1/24/2018] Ganga Raju: రధ సప్తమి పూజ విధానం

మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు.  ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 24 నాడు వస్తుంది.  అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము ,  ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం.  ఆరు ఆకులూ అంటే ఆరు ఋతువులు, ఏడూ అశ్వాలు అంటే ఏడూ కిరణాలూ.

సూర్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడులాగా మధ్యాహ్నము   తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలము, విష్ణురూపంలో భాసిల్లే కిరణాలను మనో రంజకముగా ప్రసరింప చేస్తూ ఆనందింపచేస్తాడు.

రధ సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టిత వుంది. ఆ రోజు శిరస్సుపై ఏడూ జిల్లాడు ఆకులను పెట్టుకొని నీటితో తలా స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ఏడూ జన్మలనుంచి వస్త్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెపుతారు.

సూర్యుని కిరణాలూ పడే చోట, లేక తులసి చెట్టు వున్నా చోట, ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. ఏడూ చిక్కుడు కాయలను తీసుకొని, కొబ్బరి పుల్లల సహాయముతో రథముగా చేసి, సూర్యుని రథముగా భావించి పూజ చెయ్యాలి. సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి.

గోమయంతో చేసిన పిడకలని తీసుకొని పొయ్యమీద  ఇద్దడిపాత్రలో ఆవుపాలును పోసి కర్పూరముతో వెలిగించాలి. పాలుపొంగుతున్న సమయములో, కొత్త biyyam , బెల్లం వేసి, చెరుకు గడతో తిప్పుతు పరామాన్ని తయారు చెయ్యాలి. ఈ పరామనాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణ మూర్తి కి నైవైద్యంగ సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చెయ్యాలి.

పాలు పొంగించడమంటే  , ఇంటి అభివృద్ధికి సంకేతం. ఆ చిక్కుడు ఆకుల్లో, మన కుల దేవతతో పాటు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, గణపతికి, నైవేద్యం పెట్టాలి. అందులో కొంచెం చలిమిడి, వడపప్పు పెట్టాలి. అలాగునే, ఏడూ రేగుపళ్ళుని, ఏడూ చిన్న చెరుకు ముక్కలను నైవేద్యముగా పెట్టాలి. ముందుగా గణపతిని, తరువాత కులదేవతను తరువాత సూర్య భగవానుడును ఎర్రటి పూలతో పూజించాలి. ఈ రోజు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి.     

పూజ అనంతరం, సత్ బ్రాహామునుడికి  , నువ్వులు, స్వయంపాకం లేదా పెరుగు దానం ఇవ్వాలి.

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

[6:59 AM, 1/24/2018] Krishna Gntpalli: TBSF

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి.

మీరు ఈ పోస్టుని అందరికి పంపండి. వాళ్లు చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు....
[7:10 AM, 1/24/2018] +91 72072 53159: 

Free Darshan of Lord Venkatesheara

[11:20 AM, 1/24/2018] ramani: Free Darshan of
Lord Venkatesheara
for Senior Citizens @Tirupathi.

There are two slots fixed. One at 10am and another at 3pm.

You have to produce
age proof with photo
ID and report
at S 1 counter
under the bridge
crossing the road from Gallery to Temple right side wall.
No need to climb any steps.

Good seating arrangement is available. When you are seated inside -
Hot Sambar rice and curd rice and Hot milk is provided.
Everything is free of cost.

You will get two laddus for which you have to pay Rs.20/-.

For more laddus you can pay Rs. 25/- for each laddu.

From the car parking area at the exit gate of the Temple, a battery car is available to drop you at the counter of entry and vice -versa.

At the time of Darshan all other queues are stopped only Sr.Citizen Darshan is allowed without any push or pressure.

You can just come out of Darshan within 30 minutes after darshan of the Lord.

Info courtesy :  TTD.

INFORM OTHERS TOO
🙏🙏🙏

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి.
హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.
బొట్టు పెట్టుకోవడం మంచిది, సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి ? నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? అన్న సందేహాలను తీర్చుకుందాం...

గౌరవసూచకం బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచమూ హిందూ సంప్రదాయం.

బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి ? సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం.

ఏ వేలితో ఏం ప్రయోజనం ? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి.. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

నుదుటనే ఎందుకు ? బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకము పెడతాము. మరో అధ్యయనం ప్రకారం.. బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే.. బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు.

ఎరుపు రంగే ఎందుకు ? బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.

ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.

స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం.