ఏటీఎం పిన్‌కోడ్ ఒకే రోజు మూడుసార్లు తప్పుగా ఎంటర్ చేస్తే..
30-09-2016 12:25:50
ఒకే రోజు ఏటీఎం కార్డు పిన్‌కోడ్‌ను మూడుసార్లు తప్పుగా నమోదు చేస్తే దాని నుంచి తదుపరి లావాదేవీలు నిలిచిపోతాయి. వినియోగదారుల ప్రయోజనం కోసమే బ్యాంకులు దీన్ని అమలు చేస్తున్నాయి. కార్డు ఎవరికైనా దొరకడం లేదా ఎవరైనా చోరీ చేసి సొమ్మును కాజేసే ప్రయత్నాలు నివారించడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఖాతాదారుడు సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయడం ద్వారా మరుసటి రోజుకు కార్డును సాధారణంగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసేటప్పుడు ఖాతాదారులు తప్పనిసరిగా పాస్‌పుస్తకం, ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. సేవలను పునరుద్ధరించేందకు సిబ్బంది అడిగిన వివరాలకు సంతృప్తికరమైన సమాచారాన్ని ఖాతాదారుడు చెప్పాల్సి ఉంటుంది.
బ్యాంకుల టోల్ ఫ్రీ నెంబర్లు
ఎస్‌బీఐ తమ ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు తమ ఖాతాలో నగదు నిల్వను తెలుసుకోవడానికి, మినీ స్టేట్‌మెంట్లు తీసుకోవడానికి వీలుగా క్విక్ పేరిట సేవలందిస్తుంది. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా తమ ఫోన్‌లో ఆర్‌ఈజీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి ఖాతా సంఖ్యను ఎంటర్ చేసిన తరువాత 09223488888కు మెసేజ్ పంపి రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. తర్వాత నగదు బ్యాలెన్స్ కోసం 09223866666 నెంబరుకు మిస్డ్‌కాల్ ఇస్తే వివరాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయి.
ఏటీఎం కార్డును బ్లాక్ చేయడానికి సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏటీఎం కార్డు చివర ఉన్న నాలుగు అంకెలను టైప్ చేసి 5676కు ఎస్‌ఎంఎస్ చేస్తే సరిపోతుంది. ఇదే తరహాలో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్‌బీఐకు 18004253800 లేదా 1800112211కు చేయాలి. ఎస్‌బీహెచ్‌కు 18004254055 లేదా 18004251825కు చేయా లి. ఆంధ్రాబ్యాంక్‌కు 18004251615 లేదా 1800180235, కెనరా బ్యాంకుకు 18004250018 లేదా 18004256000, ఐడీబీఐ బ్యాంకుకు 1800226999 లేదా 1800 2001947కు, సిండికేట్ బ్యాంకుకు 18004256655కు, ఇండియన్ బ్యాంక్‌కు 18004250000 లేదా 1800425422కు, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్‌కు 18004259900కు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 18002001911 లేదా 1800221622కు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 1800221006 లేదా 1800224060కు, ఐసీఐసీఐ బ్యాంకుకు 18001088181 లేదా 1800228181కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment