Saturday, August 27, 2016

సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం,కొండపల్లి వారి 4 వ వార్షికోత్సవ సభ

సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం,కొండపల్లి వారి 4 వ వార్షికోత్సవ సభ
ది. 27.08.2016, శనివారము, ఉదయం 11 గం// కు సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం,కొండపల్లి  ఆవరణలో , 4 వ వార్షికోత్సవ సభ జరిగింది.
   సమాజములో వృద్దులు ఎదుర్కుంటున్న సమస్యల గురుచి వక్తలు ప్రసంగించారు. సమస్యలు సంతానము తో రావటం దురదృష్టకరం.
ప్రభుత్వం తో వారి పోరాట ఫలితముగా వచ్చిన- RTC Buses charges లో రాయితీ, జనరిక్ మందుల దుకాణాల స్థాపన, మొదలగువని,వారి కృషి ఫలితమే, అని తెలిపారు.
రాఘవెంద్రచారి గారు  మాట్లాడుతూ - అసోసియేషన్ ప్రారంభం 2008 లోనే జరిగినా, 4సంవత్సరాలు కార్యాలయం లేక ఇబ్బంది పడుతుంటే, నాటి CE/O&M, KISHORE BABU గారి దృష్టికి తెస్తే ,వారు కార్యలయం,ఏర్పాటు కు సహకరించ్చారని,అప్పటి నుండి, సమాజ సేవ కార్యక్రమాలు చేస్తునామని తెలిపారు. వాటిలో , వృద్దులకు చలి కాలములో దుప్పట్ల పంపిణి ,వైద్య శిబిరాల ఏర్పాటు ,చేతి కర్రలు ఉచితముగా అందజేసమని, అలాగే ,జనరిక్ మందుల షాప్ ,కొండపల్లి ప్రారంభం చేయటానికి ,కొండపల్లి గ్రామా పాలక వర్గం సహకరించారని, తెలిపారు.
 కార్యక్రమ ప్రారంభంలో కొండపల్లి అప్పారావు గారు గానం చేసిన గేయాలు అందరిని ఆకట్టుకున్నాయి.
సమావేశంలో 90 సంవత్సరాలు నిండిన ,కంచి చంద్ర రావు గారిని కేకు కట్ చేసి ,ఆనందిపచేసారు.
రిటైర్ అయినాక ,ఊరికే కోర్చోకుండా ,సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న ,మన sr.citizens ఎంతైనా అభినందనీయులు.⁠⁠⁠⁠







Sunday, August 14, 2016

చీకటి కావస్తుండగా ....


Courtesy: forwarded message by what-app
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

 

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు."చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు....

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు"నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు.టూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై...అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!  
 🔸పిల్లలది కావచ్చు!
🔸తోబుట్టువులది కావచ్చు!
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు..."బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము🙏

మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

మహా భారతం నుండి
 నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు
 Courtesy: forwarded message from whatapp


1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

*12.
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ అర్జునుడిని మించిన వీరుడు ఏకలవ్యుడు  గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.⁠⁠⁠⁠

Thursday, August 11, 2016

ప్రేమ నికేతన్- మానసిక వికలాంగుల వసతి గృహం

ఈ రోజు అనగా ది.11.08.2016, ప్రేమ నికేతన్- మానసిక వికలాంగుల వసతి గృహం ,సహాయ మాతా స్కూల్ ఆవరణ,ఇబ్రహింపట్నం,కృష్ణా జిల్లా ను సందర్శించటం జరిగింది.
          వారికి దాత ల నుండి  కావాలిసిన వస్తువులు ,
కంది పప్ప్పు, బియ్యం,మినప్పప్పు, నెయ్యి ,సన్ ఫ్లవర్ ఆయిల్ ,ఎండు కారము, అలాగే ,బట్టల సబ్బులు, ఒళ్ళు తోముకొనే సబ్బులు,huggies, టూత్ పేస్టు ,టూత్ బ్రష్ లు మొదలుగు నవి.
 ఇక్కడ మొత్తం 30 మంది పిల్లలు వున్నారు. వీరిలో 5 సం // నుండి 29 సం// వయస్సు వారు వున్నారు.

వీరిలో  9 మంది మగపిల్లలు, 21మంది ఆడపిల్లలు ఉన్నారు.
వీరి యాజమాన్యాని సప్రదించు వేళలు : 9 am to 6 pm.

Phone No: 9959912677.

గమనిక: మన ఇంట్లో శుభ కార్యాలలో మిగిలిన ఆహార పదార్థాలను వీరు స్వీకరిస్తారని తెలిపారు. అయితే ,వీరికి ఒక రెండు గంటల ముందుగా తెలియ జేస్తే బాగుంటుంది.




Sunday, August 7, 2016

💩 నాగ పూజ మూఢనమ్మకమా? 💩 👀

💩 నాగ పూజ మూఢనమ్మకమా? 💩 👀
(యాజ్ఞికపీఠమ్ వాట్సప్ డెస్క్‌. హైదరాబాద్)
9848422815. 7396871862.

💩నేడే నాగ పంచమి.
(బదరీ నారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం)
7 ఆగస్టు 2016, ఆదివారం,
శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమి.

పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?
నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.

💩ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్ధాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము.

💩విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః
సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||
నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని, సర్పాలలో వాసుకిని. అంటూ సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు.

💩వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. శ్లో. వాసుకి కద్రువ తనయుడు.
అనన్తశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి
యమః సంయమతామహమ్|| 10-29 ||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా, శ్రీ మనవాళమామునులుగా అవతరించాడు.

💩ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.
నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి.

💩అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.

💩పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.

💩ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు.

💩అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.

💩ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. #నాగపంచమి, #నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.

💩ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.
ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది.

💩మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు.

💩కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.
---------------------------
ఈ విషయాన్ని ఎక్కువగా షేర్ చేసి, అందరికి తెలియపరచండి, హిందూసమాజాన్ని జాగృతం చేయండి.
మీ
P.T.G.S.KISHORESWAMY
జ్యోతిష శాస్త్ర, ఆగమ శాస్త్ర పండితులు.
9848422815. 7396871862⁠⁠⁠⁠

ఆశయస్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యము లో చల్లని మజ్జిగ పంపిణి

ది. 08.04.2016(శుక్రవారము) ఉదయం 11గంటలకు, ఇబ్రహింపట్నం రింగ్ సెంటర్ లో దుర్ముఖి నామ సంవత్సరం సందర్భముగా,ఉగాది పచ్చడి మరియు చల్లని మజ్జిగ ను పంపిణి చేసారు. Sub-inspector of Police ,ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ ,శ్రీనివాస్ గారు ,వచ్చి ఈ కార్యక్రమము ను ప్రారంభించారు. మందు వేసవి లో చల్లని మజ్జిగ ను పంపిణి చేయటం ద్వారా  చాలా మంచి చేస్తున్నారని ఫౌండేషన్  కార్యకర్తలను అభినందిస్తు ,భవిషత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనీ కోరారు.
ఎంతో మంది వాహన చోదకులు, ప్రయాణికులు, ఈ సేవ ను సద్వినియోగం చేసుకొని , ఫౌండేషన్  కార్యకర్తలను అబినందించారు. మజ్జిగ అయిపోయినప్పుడు , చల్లని నీరు అందించటం జరిగింది. ఈ కార్యక్రమములో, రహమత్,సాయి,చంద్రశేఖర్,ఇస్తారు,చిన్నా,తదితరులు పాల్గొన్నారు.

friendship day సందర్భంగా సాక్షి లో వచ్చిన వ్యాసం