Friday, March 16, 2018

ఫార్మా –డి చదివిన విద్యార్థుల పాట్లు

                          ఫార్మా –డి చదివిన విద్యార్థుల పాట్లు
      ప్రభుత్వం- ప్రజల సంక్షేమము చూడటంలో ఎంత ఘోరముగా విఫలమవుతోందో తెలపటానికి ఫార్మా-డి నిరుద్యోగులే
 నిదర్శనం. ఇంటర్మీడియట్ తరువాత ,సుమారు 10 లక్షలు పోసి ,ఆరు ఏళ్ళు ఫార్మసీ విద్య చదివి, దాదాపు 
  డాక్టర్ తో సమానమైన విద్యార్థులు, కోర్సు పూర్తి చేసి వచ్చిన తరువాత ,ఉద్యోగం లేక అల్లాడు తున్నారు.
      pharma-D(Doctor of Pharmacy)అనే కోర్సు , కేంద్ర ప్రభుత్వం చే pharmacy act 1948 చట్టం క్రింద,
Pharmacy council of India (P.C.I) ఆమోదం తో ఏర్పాటు చేయబడిన కోర్సు. ఐదు ఏళ్ళు చదువు
మరియు ఒక ఏడాది ఇంటర్న్షిప్ ను  పేరొందిన హాస్పిటల్ లో  చేసినతరువాత, మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇస్తారు.
కోర్సు తరువాత, వీరిని వైద్య శాఖ నందు ఏ పోస్ట్  లో  ఉంచాలో స్పష్టమైన  విధానము లేక పోవటం తో, 
ఈ రోజున, కష్ట పడి ఈ కోర్సు చదివిన విద్యార్థికి భవిషత్తు లేక అల్లాడు తున్నాడు!.
            ఈ విద్యకు విదేశాలలో చక్కని ప్రాచుర్యం ఉంది.   అక్కడ - డాక్టర్ చేత వ్యాధి నిర్ధారణ జరిగిన
 తరువాత,అందుకు సంబంధించిన మందులను Pharama-D చదివిన వారేఇస్తారు. మన దేశం లో మాత్రం, 
ఈ కోర్సు చదివినవారు కేవలం మెడికల్ representative గా ఉంటున్నారు.
 ఫార్మసీ విద్యలో ..డి.ఫార్మసీ, బి.ఫార్మసీ చదివినవారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి గాని, వీరికి మాత్రం ఉద్యోగాలు లేవు.
 బి.ఫార్మసీ చదివినవారికి ఈ కోర్స్ లో 4 వ సంవత్సరం లేటరల్ ఎంట్రీ గా ప్రవేశం కలిపిస్తారు.
        అంతటి ఉన్నతమైన కోర్సు కు ...ప్రభుత్వాలు ఈ గతి పట్టిస్తున్నాయి!.
 నూతన కోర్సు ను ప్రారంభించే తప్పుడు చేసే హడావుడి, వీరికి ఉద్యోగ కల్పన కానరావటం లేదు.
 ఫలితముగా సుమారు 9000మంది విద్యార్థులు,ఏటా ..ఈ విద్య నభ్యసించి బయటకు వచ్చి నిరుద్యోగులుగా 
మిగులుతున్నారు. దేశ వ్యాప్తముగా ఉన్న 219 pharma-D కాలేజీలలో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 59 కాలేజీ, 
ఉన్నాయంటే ..పరిస్థితి ని అర్థము చేసుకోవచ్చు!.
   చాల కొద్ది పాటి ట్రైనింగ్ తో ..డాక్టర్ లు అందించే సేవలను వీరూ ..అందించగలరు.ఎన్నో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో,
 మరియు ఇతర గ్రామీణ ప్రాంతాలలో, నేటికి సరియిన వైద్యుడు లేక ,అరకొరగా వైద్యం తెలిసినవారినబడి ..
ఎన్ని ప్రాణాలు పోతున్నాయో గమనించాలి. ప్రభుత్వం ఇప్పటి కైనా మేలుకోవాలి. 
వీరికి సరైన ఉపాధి మార్గము చూపి , యువతలో ఉన్న నిరాశ ను పోగొట్టాలి.లేకపోతే .. 
ఈ కోర్సు చదివిన యువతకు ఒక రకమైన నైరాశ్యం కూడు కొని...సమాజములో ఇబ్బందికర పరిస్థితులు
తలఎత్తుతాయి.